CM KCR : యాదాద్రికి రానున్న సీఎం కేసీఆర్, మోదీకి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

CM KCR : యాదాద్రికి రానున్న సీఎం కేసీఆర్, మోదీకి ఆహ్వానం

Yadadri

Updated On : September 11, 2021 / 6:47 PM IST

CM KCR Yadadri : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పనుల విషయంలో ఆయన పలుమార్లు యాదాద్రికి వచ్చారు. అక్కడ జరుగుతున్న పనులను చూసిన అనంతరం పలు సూచనలు, సలహాలు అందచేశారు. మరోసారి యాదాద్రికి వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం ఇక్కడకు రానున్నరు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మహా సుదర్శన యాగం, స్వయంభువుల పునర్దర్శనం ముహూర్తంపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.

Read More : Yadadri Temple : యాదాద్రి…పుష్కరిణి సిద్ధం, ట్రయల్ రన్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు పుష్కరిణి నిర్మాణం కూడా పూర్తైంది. కొండకింద గండిచెరువు పక్కనే నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలో నీటిని విడుదల చేసి ట్రయల్ రన్ చేపట్టారు కూడా. 43 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 4ఫీట్ల ఎత్తులో నిర్మించిన గుండంలో మోటార్ల సాయంతో 2 ఫీట్ల మేర నీరు నింపి పరీక్షించారు.  ఆలయాన్ని దసరా నాటికి ప్రారంభించాలనే దిశగా…ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read More :Yadadri Temple : యాదాద్రి ఆలయ ప్రారంభం, ముహూర్తం ఫిక్స్!

ఇప్పటికే కొండపై చేస్తున్న నిర్మాణాల పనులు ఓ కొలిక్కి వచ్చాయి. గుట్ట దిగువున మాత్రం కొన్ని ప్రధాన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దసరాకు ప్రారంభించే విషయంలో…సీఎం స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్…చినజీయర్ స్వామి వారితో చర్చించి..ముహూర్తం ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది.

Read More : Yadadri Temple : స్వర్ణ కాంతులతో వెలిగిపోతున్న యాదాద్రి ఆలయం

దసరాకు ప్రారంభించడానికి కాకపోతే..వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభోత్సవం చేపట్టే అవకాశం ఉంది. ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో నిర్మిస్తున్నందున..చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి వస్తోందని, పనులు తొందరగా కాకపోవడానికి ఇదే కారణమని అధికారులు వివరణనిస్తున్నారు.