దీపావళి పండుగ విశిష్టత ఏంటి? ఏ రోజున జరుపుకుంటారు? లక్ష్మీపూజ ఎందుకు చేస్తారంటే..

తమ ఇళ్లను దీపాలు, పువ్వులు, దియాలతో సుందరంగా అలంకరిస్తారు.

దీపావళి పండుగ విశిష్టత ఏంటి? ఏ రోజున జరుపుకుంటారు? లక్ష్మీపూజ ఎందుకు చేస్తారంటే..

Significance of Diwali 2024 (Photo Credit : Google)

Updated On : October 25, 2024 / 8:10 PM IST

Diwali 2024 : హిందువులు జరుపుకునే ప్రముఖ, ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. సిరి సంపదలు కటాక్షించే లక్ష్మీదేవతను పూజిస్తారు. దీపావళి అంటే దీపాల పండుగ అని అర్థం. అశ్విన్, కార్తీక మాసంలో వచ్చే పండుగ ఇది. దేశవ్యాప్తంగా దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. బండి చార్ దివస్, కలి పూజ, స్వాంతి, తీహార్ అని కూడా పిలుస్తారు. హిందువులే కాదు జైనులు, సిక్కులు, కొందరు బౌద్ధ మతస్తులు కూడా దివాళిని జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 1 దీపావళిని జరుపుకోనున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజునే దీపావళి జరుకుంటారని పురాణాల్లో ఉంది. దీపావళి విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం..

లక్ష్మీ పూజ ప్రాముఖ్యత..
లక్ష్మీ పూజ.. పవిత్రమైన దీపావళి పండుగ నాడు నిర్వహించబడే ముఖ్యమైన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం. సంపద, సమృద్ధి, అదృష్టం శ్రేయస్సుకు ప్రతీక లక్ష్మీ మాత. ఈ పవిత్రమైన రోజున మాతా లక్ష్మిని పూజించడం వల్ల ఆర్థిక స్థిరత్వం సిద్ధిస్తుందని, జీవితంలో విజయం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

దివాళి పర్వదినాన కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. తమ ఇళ్లను దీపాలు, పువ్వులు, కొవ్వొత్తులు, దియాలతో సుందరంగా అలంకరిస్తారు. పలు రకాల పిండి వంటలు చేసుకుంటారు. వాటిని నైవేద్యంగా దేవతా మూర్తులకు నివేదిస్తారు. ఎంతో భక్తిగా పూజలు చేస్తారు. పూజ సమయంలో గణేశుడు, సరస్వతి దేవి, కుబేరుడు, లక్ష్మీ దేవతలను పూజిస్తారు.

దీపావళి పండుగ తేదీ, ముహూర్తం..
కార్తీక లేదా అశ్విన్ మాసంలో అమావాస్య నాడు (ఆశ్వయుజ బహుళ అమవాస్య) జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి పండుగను నవంబర్ 1 న జరుపుకుంటారు. దృక్ పంచాంగ్ ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 31, 2024న ఉదయం 6:22 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ 1, 2024న 8 గంటల 46 నిమిషాలకు ముగుస్తుంది. లక్ష్మీ పూజ తిథి సాయంత్రం 06:10 గంటలకు ప్రారంభమై రాత్రి 08:52 గంటలకు ముగుస్తుంది. చోటి దీపావళిని నరక చతుర్దశి, కాళీ చౌదస్, భూత్ చతుర్దశి, రూప్ చౌదాస్, దీపావళి భోగి అని కూడా పిలుస్తారు.

ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇంటిల్లి పాది సాంప్రదాయ దస్తులు ధరిస్తారు. ఇక పలు రకాల పిండి వంటలు కూడా చేస్తారు. ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తే చాలా శ్రేష్టం అని చెబుతారు. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ వారి అనుగ్రహం దక్కుతుందన్నది భక్తుల విశ్వాసం. ఇక ఇంటి గుమ్మం దగ్గర, తులసి కోట దగ్గర కచ్చితంగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదని పండితులు చెబుతారు. ధనలక్ష్మి పూజ చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం.

Also Read : దీపావళి 2024 బెస్ట్ టెక్ గిఫ్ట్స్ మీకోసం.. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ గాడ్జెట్ కొనేసుకోండి..!