Samatha (1)
Hayagreeva Swamy Pooja : అపురూపం.. అద్వితీయం.. మహిమాన్వితం.. మహావైభవం సమతామూర్తి సంరంభం. అణువణువూ ఆధ్యాత్మికం.. అడుగడుగునా భక్తి తత్వం.. యజ్ఞాలు, అష్టాక్షరీ మంత్ర పఠనాలు.. చతుర్వేద పారాయణాలతో .. నిర్విఘ్నంగా, నిరంతరాయంగా, నిరాటంకంగా సమతామూర్తి వెయ్యేళ్ల పండుగ జరుగుతోంది. ఎనిమిదో రోజు కుండాత్మక మహాయజ్ఞ కార్యక్రమం ఆరంభమైంది. అష్టాక్షరీ మహా మంత్ర అనుష్టాన కార్యక్రమం, ఆరాధన భగవత్ సన్నిధానంలో కొనసాగింది. వేద, పురాణాది గ్రంథాల యొక్క పారాయణ ప్రారంభ శ్లోకాలను, మంత్రాలను విన్నవించారు. యాగశాలలో ద్వార, తోరణ, ధ్వజ, కుంభ మొదలైన ఆరాధానలు జరిపి హవనాన్ని ఆరంభించారు. యజ్ఞశాలలో కూర్చొనే వారు.. వేదశాలలకు వెళ్లి.. సంకల్పం చేయించుకోవాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి సూచించారు. హయగ్రీవ స్వామి ఒక జ్ఞానమూర్తి అని, రామానుజ స్వామి వారి యొక్క జీవితంలో కశ్మీర దేశానికి వచ్చినప్పుడు సరస్వతి. . రామానుజుల ద్వారా వేద మంత్ర వ్యాఖ్యాన్ని విని కప్పిశ్వాం అనే శృతికి చాల సంతోషంతో.. రామానుజావారులను భాస్యకార అని పిలిచిందన్నారు. తన దగ్గర ఉన్న హయగ్రీవ మూర్తిని వారికి ఇచ్చిందన్నారు. ఆయనను ఆరాధన చేసుకోవడం మంచి జ్ఞానాన్ని పొందాలని, చిన్నారులకు చక్కటి జ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ప్రతిమలను అందిస్తారని, దీనికి సంబంధించిన వివరణనను శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామ చంద్ర రామాను జీయర్ స్వామి అనుగ్రహిస్తారని తెలిపారు.
Read More : Best Recharge Plan: రూ. 197కే 150రోజుల వాలిడిటీ.. అద్భుతమైన ప్లాన్ ఇదే!
ఈ మహిమాన్విత మహాద్భుతాన్ని తిలకించేందుకు, ఈ పండుగలో భాగస్వాములయ్యేందుకు .. వీఐపీలు, సామాన్యులూ తరలివస్తున్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ఎనిమిదో రోజు.. పెద్ద సంఖ్యలో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యులు రాకతో సందడిగా మారింది. ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన చేశారు. 9 గంటల నుంచి శ్రీ లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం జరుగుతోంది. ఉదయం 10 గంటలకు ఐశ్వర్యప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి..సంతానప్రాప్తికై వైనతేయ ఇష్టి జరగనున్నాయి. ఉదయం 10.30గంటలకు యాగశాలలో చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధికి హయగ్రీవ పూజ నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు దేశంలోని ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు జరిగింది. ఈ సదస్సుకు 2వందల మంది సాధు, సంతులు, పీఠాధిపతులు. హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి.. 2.30 గంటలకు ప్రవచన మండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం.. రాత్రి 9 గంటలకు పూర్ణాహుతితో 8వ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి.
Read More : Nelson Dilip Kumar : రజినీకాంత్ నెక్స్ట్ సినిమా.. ఫామ్‌లో ఉన్న దర్శకుడితో..
మరోవైపు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చి సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకుని వెళ్తున్నారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇక్కడికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికి మూలం అన్న ఆయన.. సమతామూర్తి విగ్రహం.. ఏకతా సందేశాన్ని అందిస్తోందని వివరించారు. ఇక బుధవారం శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో .. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ముచ్చింతల్‌కు రానున్న మోహన్ భగవత్.. రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో ప్రసంగిస్తారు.