RajaShyamala Deeksha
RajaShyamala Deeksha : రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు లేదా మాఘ శ్యామల నవరాత్రులు 2025 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరుగుతాయి. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులుగా కూడా పిలుస్తారు. గుప్త నవరాత్రులు అనగా సాధారణ పూజల మాదిరిగా కాకుండా రహస్యంగా జరుపుకునే నవరాత్రులు. ఈ అమ్మవారి పూజలో దుర్గమ్మను 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలను పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో కూడా శ్యామల నవరాత్రులు అని పిలుస్తారు.
Read Also : Maha Kumba Mela 2025 : కుంభమేళా వెళ్లలేకపోయారా?.. మీకూ పుణ్యఫలం దక్కాలంటే.. ఈ రకంగా చేయండి..!
ఇంతకీ, ఈ నవరాత్రుల సమయంలో శ్రీరాజశ్యామల దీక్ష ఎలా చేయాలో తెలుసా? రాజశ్యామల దీక్షను అసలు ఎప్పుడు స్వీకరించాలి? ఎలా స్వీకరించాలి? ఏ మాలను వేసుకోవాలి? ఇలాంటి సందేహాలు ప్రతిఒక్కరికి ఉంటాయి.
అమ్మవారి మహామంత్రం 11 మాలల జపం చేయాలి :
గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా రాజశ్యామల అమ్మవారి దీక్షను చాలామంది స్వీకరించారు. అమ్మవారి దీక్షను స్వీకరించడానికి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. మెడలో రుద్రాక్ష మాల వేసుకోవాలి. ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారి మహా మంత్రం 11 మాలల జపం చేయాలి. అమ్మవారి చిత్రపటానికి పంచోపచార పూజ చేయాలి.
అలాగే భూషయనం చేయాలి. దీక్షలో ఎలాంటి నియమాలు పాటిస్తారో అలాంటి నియమాలను పాటించవచ్చు. పూర్ణాహుతి మహోత్సవం రోజున అనగా ఫిబ్రవరి 7వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే పూర్ణాహుతి మహోత్సవంలో కూడా ఈ దీక్షను స్వీకరించినవారు కూడా పాల్గొనవచ్చు.
ఆ పూర్ణాహుతిలో మీరు కూడా స్వయంగా అమ్మవారికి పూర్ణ ఫలాన్ని సమర్పించవచ్చు, దీక్షను కూడా విరమించవచ్చు. మాల జపం చేయడానికి ఆకుపచ్చ ఊల్ దారముతో 30 ముడులను వేసి ఆ మాలనే మీరు స్వయంగా జపం చేసేందుకు వినియోగించవచ్చు. ఒకవేళ మీ వద్ద ఆ మాల ఉంటే అదే వాడుకోవచ్చు.
Read Also : Mauni Amavasya 2025 : 29నే మౌని అమావాస్య.. శుభముహూర్తం, పూజా విధానం ఏంటి? ఏ మంత్రాలను జపిస్తే మంచిదంటే?
108 పూసల రుద్రాక్ష మాల కూడా వాడొచ్చు :
ఆ మాల మీద దగ్గర లేనిపక్షంలో 108 పూసలు కలిగిన రుద్రాక్ష మాలను మీరు చేసే జపానికి ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా హక్కి మాల, స్పటిక మాల, పగడాల మాల, ఏదైనా మాల ఉపయోగిస్తే ఆ మాలను కూడా రాజశ్యామల అమ్మవారి గుప్త నవరాత్రులలో మంత్రజపం చేసేందుకు కూడా వినియోగించుకోవచ్చు.
అలాగే దీక్ష చేయకపోయినా దీక్షా నియమాలను పాటిస్తూ భూసయనం చేస్తూ శాఖహారం మాత్రం భుజిస్తూ 9 రోజుల పాటు అమ్మవారికి దగ్గరగా ఉంటూ అమ్మవారి నామస్మరణ చేసినా కూడా దీక్ష చేసినంత గొప్ప ఫలితాన్ని కూడా పొందవచ్చు.