Maha Kumba Mela 2025 : కుంభమేళా వెళ్లలేకపోయారా?.. మీకూ పుణ్యఫలం దక్కాలంటే.. ఈ రకంగా చేయండి..!
Maha Kumba Mela 2025 : మహాకుంభమేళాలో కోట్లాదిమంది భక్తుల సంగమ స్నానాలతో ప్రయాగ్ రాజ్ కిటకిటకలాడుతోంది. కుంభమేళాకు వెళ్లలేని వారు ఆందోళన చెందనక్కర్లేదు. కొన్ని పరిహారాలను పాటిస్తే వెళ్ళినంత పుణ్యఫలం వస్తుందట..

Maha Kumba Mela 2025
Maha Kumba Mela 2025 : మహాకుంభమేళాకు వెళ్లలేకపోతున్నారా? అందులోనూ మౌని అమావాస్య నాడు పవిత్రజలంలో స్నానం చేసేందుకు అవకాశం లేదని చింతిస్తున్నారా? ప్రతి ఒక్కరికి మహాకుంభానికి వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక విధాలుగా మహాకుంభమేళాకు పోయినంత పుణ్యాన్ని పొందవవచ్చు. మహాకుంభ్ 2025 రెండో అమృత స్నానం జనవరి 29న జరుగుతుంది.
ఈ రోజు మౌని అమావాస్య. ఈ తిథిన హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కుంభమేళకు వెళ్లలేకపోయినా మీకు పుణ్యఫలం దక్కాలంటే కొన్ని పనులను చేయడం ద్వారా అక్కడికి వెళ్లినంత ఫలాన్ని దక్కించుకోవచ్చు అంటున్నారు వేద పండితులు. ప్రత్యేకించి ఈ రోజున మహాకుంభానికి వెళ్లలేని వారు ఇంట్లోనే స్నానం చేసి పుణ్యఫలం పొందవచ్చునని చెబుతున్నారు.
మౌని అమవాస్యనాడు ఇలా చేస్తే పాపాలన్నీ పోతాయట :
త్రివేణి సంగమంలో స్నానం చేయడం ఎల్లప్పుడూ పవిత్రమే. కుంభమేళా జరిగిన రోజులన్నింటిలో అత్యంత పవిత్రమైన రోజులలో మౌని అమావాస్య కూడా ఒకటి. ఈరోజు చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. మాఘ మాసంలో అమావాస్య రోజున మౌని అమావాస్య వస్తుంది.
ఈ రోజున గంగా, యమునా, సరస్వతి నదుల (త్రివేణి సంగమం) సంగమంలో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుందని, అన్ని పాపాలను తొలగిపోతాయని అంటారు. మౌని అమావాస్య నాడు ఉపవాసం, ధ్యానం, దానధర్మాలు లాంటివి చేయడం పుణ్యప్రదమని పురాణాల్లో చెప్పారు. ఎందుకంటే, మౌని అమావాస్య రోజున చేసే కార్యాలు అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందవచ్చు. కోరిన కోరికలు నెరవేరుతాయి.
మహాకుంభమేళాకు వెళ్లలేనివారు ఇలా చేయాలి :
కుంభమేళాకు వెళ్లలేనివారికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మీకు సమీపంలో నదిస్నానం చేసినా కుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. లేదంటే.. మీ సమీప బంధువులు ఎవరైనా కుంభమేళా వెళ్తుంటే వారితో అక్కడి గంగాజలాన్ని తెప్పించుకోవాలి.
ఆ నీళ్లను ఈ పరమ పవిత్రమైన రోజుల్లో ఆ నీళ్లను మీ మీద చల్లుకున్నా కుంభమేళా స్థాన పుణ్యఫలితం వస్తుంది. ఆ కుంభమేళా నీళ్లు దొరకపోయినా పరమపవిత్రమైన రోజుల్లో విష్ణుసహస్రనామం, శివసహస్రనామం పరాయణం చేస్తూ ఇంట్లో దొరికే నీళ్లతో మీద జల్లుకున్నా కుంభమేళాలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది.
ఇంట్లోనే ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే.. సంగమంలో చేసినంత పుణ్యం :
మౌని అమావాస్య నాడు గంగ వంటి పుణ్యనదులలో స్నానం చేస్తే.. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ రోజున నదులలో స్నానం చేయడం తప్పనిసరి. మీకు సమీపంలో నది లేకుంటే లేదా కొన్ని కారణాల వల్ల మీరు మహాకుంభానికి వెళ్లి సంగంలో స్నానం చేయలేక పోతే, మీరు ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అయితే, ఇంట్లో స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలను తెలుసుకోవాలి. ఇందుకోసం స్నానానికి ముందు నీళ్లు నింపిన బకెట్‌లో గంగాజలం వేసి స్నానం చేయాలి.
దాంతో పాటు గంగామాత మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మహాకుంభానికి వెళ్లి సంగమంలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు, ఈ గంగా మంత్రాన్ని (‘గంగా చ యమునే చైవ గోదావరి సరస్వతి. నర్మదే సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధిం కురు’) జపిస్తూ ఉండండి.. మీరు ఎంతో పుణ్య ఫలితాలను పొందుతారు. పుణ్య నదుల జలాలను రెండు, మూడు చుక్కలను ఇంట్లో స్నానం చేసే నీటిలో కలిపి చేసినా అంతే పుణ్యపలం వస్తుందని చెబుతున్నారు.
పవ్రిత జలం నేరుగా మీ ఇంటికే డోర్ డెలివరీ :
మహాకుంభమేళాకు వెళ్లలేనివారి కోసం నేరుగా ఇంటికే డోర్ డెలివరీ అందించే అవకాశం ఉంది. త్రివేణి సంగమం వద్ద జలాల్లో స్నానం చేయలేని వారికి ఆ జలాలు ఇంటికే పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నాయి.
Read Also : Mauni Amavasya 2025 : 29నే మౌని అమావాస్య.. శుభముహూర్తం, పూజా విధానం ఏంటి? ఏ మంత్రాలను జపిస్తే మంచిదంటే?
అందులో “ది త్రివేణి సంగం వాటర్ డెలివరీ సర్వీస్” ఒకటి. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం నుంచి నేరుగా ఆ జలాన్ని మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తుంది. అంతేకాదు.. ఆన్‌లైన్ డెలివరీ కంపెనీ ఫ్లిప్కార్ట్లోనూ మహాకుంభ్ నీళ్ల బాటిళ్లు లభ్యమవుతున్నాయి. కానీ, ఇలా ఆర్డర్ చేసినవాళ్లకు డెలివరీ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు.
గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం పవిత్రతను భక్తుల ఇళ్లకు తీసుకొచ్చేందుకు శ్రీ మందిర్ అనే భక్తి యాప్ కూడా అందుబాటులో ఉంది. వినూత్న త్రివేణి సంగమం జల్ డెలివరీ సర్వీసును ప్రవేశపెట్టింది.
మహా కుంభం పరివర్తన శక్తిని వ్యక్తిగతంగా అనుభవించేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడమే ప్రాథమిక లక్ష్యంగా శ్రీ మందిర్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ సచన్ అన్నారు. త్రివేణి సంగమం జల్ డెలివరీ సర్వీసు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం నుంచి నేరుగా నీటిని అందిస్తుంది. ఈ నీరు 7-10 పనిదినాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది.