Diwali Day : దీపావళి రోజు వీటిని చూస్తే డబ్బుకు లోటుండదా!…
దీపావళిరోజున లక్ష్మీదేవి అందరి ఇళ్ళల్లోకి వస్తుందని నమ్ముతారు. ఆ క్రమంలోనే ఇంటిని శుభ్రం చేసుకుని పండుగరోజు సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని తమ గృహంలోకి సాదరంగా ఆహ్వానిస్తార

Deepavali 2 (2)
Diwali Day : దీపావళి పండుగ హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగ ఇది. నరకాసుర సంహారంతో సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజుగా చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటారు. పండుగ రోజున ఇంట్లో, వీధిలో , దేవాలయాల్లో దీపాలతో ప్రత్యేకంగా అలకరిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అవునెయ్యి లేకుంటే నువ్వుల నూనెతో ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. ఆ దీపంలో లక్ష్మీదేవిని చూస్తూ స్మరించుకుంటారు.
దీపావళిరోజున లక్ష్మీదేవి అందరి ఇళ్ళల్లోకి వస్తుందని నమ్ముతారు. ఆ క్రమంలోనే ఇంటిని శుభ్రం చేసుకుని పండుగరోజు సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని తమ గృహంలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. దీపావళికి సంబంధిచి పురాణాల గాధల ప్రకారం అనేక నమ్మకాలు ఉన్నాయి. దీపావళి రోజున కొన్ని జంతువులు, పక్షలు కనిపిస్తే రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుందని, ఆఇంట్లోని వారికి డబ్బుకు కొదవుండదని, లక్ష్మీదేవి కటాక్షిస్తుందని విశ్వసిస్తారు. దీపావళి రోజు రాత్రి గుడ్లగూబ కనిపిస్తే ఇక వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట. లక్ష్మీదేవికి వాహనంగా గుడ్లగూబను చెప్తారు. పండుగరోజు రాత్రి గుడ్లగూబను చూస్తే ఐశ్వర్యంతోపాటు, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.
అంతేకాకుండా పండుగ రోజు పిల్లిని చూడటం కూడా మంచిదేనట, ఇంట్లో పూజ ముగిసిన తరువాత పిల్లి కనిపించిందంటే అది లక్ష్మీదేవి రాకకు ఓ సంకేతంగా బావిస్తారు. భవిష్యత్తు కాలంలో ఆ ఇంట్లో అంతా మంచి జరగటంతోపాటు కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తుందని చెప్తారు. అలాగే దీపావళి రోజు రాత్రి బల్లి కనిపిస్తే ఆర్ధిక సమస్యలన్నీ తొలగిపోతాయట. తమ చేతికున్న పుట్టుమచ్చలను పండుగరోజు చూడటం శుభప్రదంగా భావిస్తారు. దీపావళి రోజు ఇలా చూసినవారి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని భావిస్తారు. ఏది ఏమైనా దీపావళి పండుగరోజు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేందుకు ప్రతి ఇల్లు వెలుగులు వెదజల్లే దీపాలతో ముస్తాబై ఉంటుందని చెప్పవచ్చు.