Lakshmi Devi : లక్ష్మీదేవి చీపురులో కొలువై ఉంటుందా…దీపావళి రోజున కొత్త చీపురు ఎందుకు కొనాలి?
అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాల ప్రకారం దీపావళి రోజున చీపురు కొన్న తర్వాత, పూజ చేసి మరుసటి రోజు నుండి ఉపయోగించాలి. చీపురు వాడటంవల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అని నమ్ముతారు.

Deepawali
Lakshmi Devi : ఆశ్వీజ చతుర్ధశి దీపావళి యమునికి ఇష్టమైన రోజు. ఆరోజు సూర్యోదయానికి ముందే తలకు నువ్వుల నూనె అంటుకుని అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనెలో లక్ష్మీ, మంచి నీటిలో గంగా దేవి కొలువై ఉంటారు. అమావాస్యరోజున దీపావళి ముహుర్తంలో లక్ష్మీ దేవికి పూజలు నిర్వహించాలి. తెల్లవారు జామున మంగళ స్నానం ఆచరించి మధ్యాహ్నం సమయంలో పితృదేవతలకు శ్రార్ధము, బ్రహ్మణులకు భోజనం పెట్టాలి. సాయంత్రం పుష్పాలు, ఆకులుతో అలకరించి లక్ష్మీ, విష్ణువు, కుభేరుడిని పూజించాలి. ఎండిన గోంగూరు పుల్లలకు ఒత్తులు చుట్టి వెలిగించి దక్షిణం వైపుకు చూపించి పితృదేవతలను ప్రార్ధిస్తారు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయవచ్చు. లక్ష్మీ దేవిని అరాధించేది సంపదలు,శుభాలు కలగేందుకే..
అదే సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కో పండుగగు ఒక్కో అచారాన్ని పాటించటం అలవాటుగా, ఆనవాయితీగా వస్తుంది. అయితే దీపావళి పండుగకు మాత్రం మన ఇంట్లో పాత చీపురు స్ధానంలో కొత్త చీపురును కొనుగోలు చేయటం చాలా ప్రాంతాల్లో అచారంగా కొనసాగుతుంది. చీపురును చాలా మంది లక్ష్మీదేవిగా భావిస్తారు. దీపావళి రోజున చీపురు కొనడం కూడా శుభప్రదం. చీపురుతో అర్ధరాత్రి సమయంలో ఇల్లు ఊడ్చి దుమ్ము, దూళిని బయటపడేయండి. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో ఇంట్లో దుమ్మును ఊడ్వరు. అయితే దీపావళి రోజున చీపురుతో ఇంట్లో దుమ్మును ఊడ్చి బయటపడేస్తారు. దీని వల్ల అలక్ష్మీ బయటకు వెళ్ళిపోతుందని నమ్మకం.
అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాల ప్రకారం దీపావళి రోజున చీపురు కొన్న తర్వాత, పూజ చేసి మరుసటి రోజు నుండి ఉపయోగించాలి. చీపురు వాడటంవల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అని నమ్ముతారు. చీపురును అవమానిస్తే లక్ష్మి దేవిని అవమానించినట్లే అంటారు. చీపురు పాదాలపై పడకూడదు. ఇలా జరిగితే అపశకునంగా భావిస్తారు. ఐశ్వర్యానికి ఆది దేవత లక్ష్మీ దేవి చీపురులో నివాసముంటుందని నమ్మకం. కాబట్టి దీపావళి రోజున లక్ష్మి శాశ్వతంగా నివసించే చీపురును దేవాలయంలో దానం చేసినా మంచిదని చెబుతుంటారు. దీపావళి రోజునే కాకుండా శనివారం తప్ప వారంలో ఏ రోజైనా చీపురు కొనుక్కోవచ్చు.. శనివారం మాత్రం చీపురు కొనడం అశుభంగా భావిస్తారు. దీపావళి రోజున కొత్తఇల్లు, నగలు, వాహనాలు, గృహోపకరణాలను కొనుగోలు చేస్తుంటారు. అందుకే దీపావళికి అనేక కంపెనీలు ఆఫర్లతో ముంచెత్తుతుంటాయి.