Durga Temple : దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Durga Temple : అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండ దిగువున ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు రాంబాబు వెల్లడించారు.

Durga Temple : దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Durga Temple (Photo : Google)

Updated On : May 29, 2023 / 7:36 PM IST

Durga Temple Governing Body : విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి సమావేశంలోని నిర్ణయాలను దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. దుర్గాఘాట్ లో స్నానాలు ఆచరించే‌ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తీర్మానించామన్నారు. ప్రొవిజన్స్ స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

దుర్గాఘాట్ నుంచి గిరి ప్రదక్షణ మార్గంలో దేవస్ధానం బస్సు నడపాలని నిర్ణయించారు. దేవస్ధానంలో అమ్మవారి సేవ చేసుకునే ఉచిత ప్రసాదం అందచేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండ దిగువున ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు రాంబాబు వెల్లడించారు.

Also Read..Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం.. భక్తులకు శుభవార్త, ఆలయ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్

గత పాలకుల సమయంలో ధనికుడైతేనే అమ్మవారి చెంత డైరెక్టర్ గా అవకాశం కల్పించే వారని కర్నాటి రాంబాబు ఆరోపించారు. కానీ, జగన్ ప్రభుత్వంలో మాత్రం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు డైరెక్టర్లుగా అవకాశం కల్పించారని చెప్పారు. ఇక, ప్రతిరోజు 3వేల నుంచి 4వేల మందికి అన్నదానం చేయాలని.. శని, ఆదివారాల్లో 5వేల మందికి పెట్టాలని నిర్ణయించామన్నారు. రూ.500 టిక్కెట్ తగ్గింపుపై ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ప్రకటిస్తామన్నారు.