Magha Purnima 2025 : మాఘ పౌర్ణమి.. నదీ స్నానాలు చేయలేని వారు ఏం చేయాలి, ఎలాంటి దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి..

మాఘ మాసము సూర్య నారాయణ మూర్తికి అత్యంత ప్రియమైన మాసం. ప్రయాగలో గంగా స్నానం 24 గంటల పాటు చేయొచ్చు. ఇంట్లో మాత్రం..

Magha Purnima 2025 : మాఘ పౌర్ణమి.. నదీ స్నానాలు చేయలేని వారు ఏం చేయాలి, ఎలాంటి దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి..

Updated On : February 12, 2025 / 12:50 AM IST

Magha Purnima 2025 : మాఘ పౌర్ణమి.. దీని విశిష్టత ఏంటి? మాఘ పౌర్ణమి రోజున ఏం చేయాలి? ఎలాంటి స్నానం ఆచరించాలి? అలా చేయడం వల్ల కలిగే శుభాలు ఏంటి.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల మాటల్లో తెలుసుకుందాం..

”ఏ నక్షత్రంలో అయితే పౌర్ణమి వస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించిన మాసంగా చెబుతున్నాం. 12 మాసాలు ఉంటాయి. ఒక్కో మాసానికి ఒక్కో పౌర్ణమిలో ఒక్కో నక్షత్రం వస్తుంది. ఇంత విశేషంగా చెబుతున్న మాఘ పౌర్ణమి.. ఈసారి మకా నక్షత్రంలో రాలేదు. ఆశ్లేషలోనే ఉంది. మంగళవారం మాఘ పూర్ణిమ సాయంత్రం 6.55 గంటలకు మొదలైన పౌర్ణమి.. రేపు సాయంత్రం 7.23కి అయిపోతుంది.

రాత్రి వేళ చంద్రుడు చల్లని వెన్నెల కురిపించాలి. అదీ పౌర్ణమి అంటే. పౌర్ణమిలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే.. శ్రీ చక్ర ఆరాధనం. లేదా భక్తికి సంబంధించిన ఎలాంటి ఆరాధన అయినా చేయొచ్చు. చల్లని వెన్నెలలో కూర్చుని, ఆ కిరణాలు మనల్ని తాకుతున్నప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి. ఈ ఆలోచనలు తగ్గినప్పుడు దైవంతో మన ఆత్మను లింక్ చేసుకోవడానికి పౌర్ణమిని వాడుకోవాలి” అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

”కుంభమేళాకు, నదీ స్నానాలకు వెళ్ల లేని వారు చక్కగా ఇంట్లోనే గంగేచ యమునేచ గోదావరి సరస్వతి మంత్రాన్ని చదువుకుని, ఒక కలశంలోకి ఆవాహన చేసుకుని, ఆ నీళ్లు తీసుకెళ్లి ఒక బకెట్ లో పోసుకుని చక్కగా తల స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. అలాగే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించండి. సత్ ఫలితం వస్తుంది.

సముద్ర స్నానం చేయడం వల్ల ఎగ్జిమా(గజ్జి) పోతుంది. అలా చెప్పకుండా పుణ్యం వస్తుందని చెబుతారు. సముద్ర స్నానం చేయడం వల్ల మీకు ఆరోగ్యం, మీకు ఐశ్వర్యం లభిస్తుందని చెబుతారు. ఈ ప్రపంచంలో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఏముంది? ఆరోగ్యవంతుడే నిజమైన ఐశ్వర్యవంతుడు.

ఎంత డబ్బు ఉన్నా.. మీరు ఆరోగ్యం పొందలేరు. మీకు ఎంత డబ్బున్నా మానసిక ప్రశాంతత పొందలేదు. మాఘపౌర్ణమి రోజున చక్కగా అన్ని దానాలు, ధర్మాలు చేసుకోవచ్చు. తల్లి తర్వాత తల్లిలా గౌరవించబడిన గోమాతను గౌరవించండి. నెయ్యిని దానం చేయండి. పాలతో చేసిన పదార్ధం దానం చేయండి. బియ్యం, నువ్వులు, బెల్లంతో చేసిన ఆహార పదార్ధాన్ని దానం ఇవ్వండి.

ఇప్పటిదాకా చల్లగా ఉన్న సూర్యుడు అంటే.. సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. మాఘ మాసం నుంచి సూర్యుడు రైజింగ్ లో ఉంటాడు. ఎండలు పెరుగుతాయి. శక్తిమంతంగా భూమి మీదకు వస్తాడు. మాఘ మాసంలోనే రథసప్తమి వచ్చింది, పౌర్ణమి వచ్చింది. భీష్మ ఏకాదశి ఉంది. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు జూలై వరకు రైజింగ్ లో ఉంటాయి” అని ఆధ్యాత్మికవేత్త నాగరాజు తెలిపారు.

Also Read : ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో వైభవంగా సమతా కుంభ్-2025 ఆధ్యాత్మిక వేడుకలు..

బంగారయ్య శర్మ, ఆధ్యాత్మికవేత్త..
”మాఘ మాసము సూర్య నారాయణ మూర్తికి అత్యంత ప్రియమైన మాసం. ప్రయాగలో గంగా స్నానం 24 గంటల పాటు చేయొచ్చు. ఇంట్లో మాత్రం ఉదయం చేయొచ్చు, సాయంత్రం చంద్రోదయం తర్వాత చేయొచ్చు. లేదా ప్రోక్షణ చేసుకోవచ్చు. మాఘ మాసంలో గంగకు ఉండే 12 పేర్లు తలుచుకోవాలి. నందిని, నళిని, సీత, మాలినీచ, మహాపగ విష్ణు పాదాభ్య సంభూత గంగా త్రిపద గామిని భాగీరథి భోగవతి జాగ్నవి త్రిదశేశ్వరి యత్ర యత్ర జలాశయే స్నానకాలే పఠే నిత్యం మహా పాతక నాశిని..

అన్ని పాపాలను తీసేటటువంటి ఈ మాసం పేరే మఘ.. సమస్తమైన పాపాల నుంచి దూరం చేసేది కాబట్టి.. ఈ పూర్ణిమకు ఇంత ప్రత్యేకత ఉంది. ఈ పూర్ణిమ నాడే దక్షుడు మన సముద్రంలోకి వెళ్లి స్నానం చేస్తుంటే శంఖంలో ద్రాక్షాయణి అమ్మవారు దొరికింది. ఆ మహా శక్తి ఆయనకు దొరికింది ఈ మాఘ పూర్ణిమ నాడే. అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన పరమేశ్వరుడికి మహత్తరమైన ఓంకార విషయాన్ని బోధ చేశాడు కాబట్టి ఈ మహామాఘి చాలా విశేషం.

దానము, స్నానము, జపము, పెద్ద వాళ్లకు తర్పణాలు వదలడం, ప్రధానంగా గురువుని బాగా స్మరించుకోవాలి. గురు ధాన్యం చాలా అవసరం. సుబ్రమణ్యుడు అంతటి వాడు శివుడికి బోధన చేసినటువంటి రోజు. గురువుల దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా నమస్కరించి గురువుల ఆశీస్సులు తీసుకుంటే చాలా విశేషమైన ఫలితం. పక్షులకు కాస్త ధాన్యం వేయడం, చీమలు, కీటకాలకు కాస్త పంచదార వేయడం, మనుషులకు ఉపచారాలు చేయడం. ఏది తోస్తే అది. నూగులు రాసుకుని స్నానం చేయొచ్చు. లేదా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే మంచిది. మాఘ మాసం అంతా స్నానం విశేషం. అందులో పూర్ణిమ మరీ విశేషం”.