Samatha Kumbh 2025: ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో వైభవంగా సమతా కుంభ్-2025 ఆధ్యాత్మిక వేడుకలు..

ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీ రామానుజక్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Samatha Kumbh 2025: ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో వైభవంగా సమతా కుంభ్-2025 ఆధ్యాత్మిక వేడుకలు..

Samatha Kumbh 2025

Updated On : February 11, 2025 / 2:29 PM IST

Samatha Kumbh 2025: ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీ రామానుజక్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈనెల 9వ తేదీన ఉత్సవారంభ స్నపనం, అంకురారోపణతో ప్రారంభమయ్యాయి. భగవద్రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం ఆరంభమైన శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరగనున్నాయి.

Also Read: Astrology Tips : రుద్రాక్ష ధరించే ముందు గుర్తుంచుకోవాల్సిన 9 విషయాలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

రేపు (బుధవారం) రామానుజ నూత్తందాది సామూహిక పారాయణము, సమతా కుంభ్ లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, 108 దివ్య దేశాలకు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 13న ఆచార్య వరివస్య, 15న శాంతి కళ్యాణ మహోత్సవం, 16వ తేదీ ఉదయం వసంతోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం, 18వ తేదీన రథోత్సవం – చక్రస్నాన ఘట్టాలు జరుగుతాయి. పది రోజుల వేడుకల్లో నిత్యం సుప్రభాతం, అష్టాక్షరీ మంత్రజపం, విష్ణు సహస్రనామ పారాయణం, 18 దివ్యదేశ మూర్తులకు గరుడసేవ, ఇలా ఆధ్యాత్మిక శోభతో ముచ్చింతల్ శ్రీరామనగరం పరశిస్తుంది. శ్రీరామానుజాచార్య -108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.