Mahakumbh 2025 : మహాకుంభమేళాలో మొదటి రోజు 60 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు.. ఏరియల్ ఫుటేజీలో భారీ జనసందోహం!

Mahakumbh 2025 : మొదటి రోజు 60 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా ఏరియల్ ఫుటేజీలో భారీ జనసందోహం కనిపిస్తోంది.

Mahakumbh 2025

Mahakumbh 2025 : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవయ్యాయి. ఈరోజు (జనవరి 13) నుంచి ఫిబ్రవరి 26వరకు దాదాపు 45 రోజులపాటు ఈ ఆధ్యాత్మిక వేడుక జరుగనుంది. ఇప్పటికే యూపీ ప్రభుత్వం మహాకుంభమేళా కోసం భారీ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

Read Also : Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం.. త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తజనం

పుష్యమాసం పౌర్ణమిని పురస్కరించుకుని ప్రయాగ్ రాజ్‌లో ప్రారంభమైన మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు 60 లక్షల మంది లక్షల మంది భక్తులు పుణ్యస్నానాన్ని ఆచరించారు. గంగా యమున సరస్వతీ కలిసే త్రివేణి సంగమం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలను ఆచరించారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా 2025 ఘాట్‌ల వద్ద డ్రోన్ కెమెరాల నుంచి తీసిన విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి.

సోమవారం నాడు దాదాపు 60 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఇప్పటికే ఘాటులన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. భక్తుల కోసం విస్తృతమైన భద్రత ఏర్పాట్లతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలను అందిస్తున్నామని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

Mahakumbh 2025

డ్రోన్ కెమెరాల నుంచి తీసిన విజువల్స్ చూస్తుంటే.. మహాకుంభమేళా 2025 ఘాట్‌ల వద్ద లక్షలాది మంది సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక ఈవెంట్‌గా పేరొందిన ఈ మహా ఉత్సవం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. గంగానది పవిత్ర సంగమంగా పేరొందిన యమునా, ఆధ్యాత్మిక సరస్వతి నదులు కలిసిన చోట ఈ మహాకుంభమేళా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.

మకర సంక్రాంతి సందర్భంగా మంగళవారం (జనవరి 14) మొదటి మేజర్ షాహీ లేదా అమృత్ స్నాన్ ప్రారంభమవుతుంది. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన మహాకుంభమేళా ప్రత్యేకమైనదని పలు నివేదికలు పేర్కొన్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాన్ని జరుపుకుంటారు. ఫిబ్రవరి 26న ముగిసే 2025 మహాకుంభానికి 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

60 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు
2025 మహాకుంభ్‌లో డ్రోన్‌లు, సీసీటీవీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మెరుగైన భద్రత, సజావుగా కార్యకలాపాలు జరుగుతాయని యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. విస్తరించిన ‘ఘాట్‌లు’ క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో ఈ ఏడాది కుంభమేళాకు హాజరైన వారందరికీ ఆధ్యాత్మికపరమైన సురక్షితమైన అనుభవాన్ని అందించేలా అధికారులు దృష్టి సారించారని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. దాదాపు 60 లక్షల మంది ఇప్పటికే స్నాచమాచరించారని అయితే అధికారిక గణాంకాలను త్వరలో విడుదల చేస్తామని అధికారి తెలిపారు.

“ఈరోజు ఉదయం పవిత్ర స్నానంతో మహా కుంభం ప్రారంభమైంది. దాదాపు 60 లక్షల మంది ఇప్పటికే స్నానాలు చేశారు. సాంప్రదాయ పోలీసు ఏర్పాట్లకు అదనంగా, మేం మెరుగైన సాంకేతికతను అందిస్తున్నాం. భక్తులకు భద్రతకు మరింత సానుకూల ప్రభావాన్ని చూపుతోంది”అని డీజీపీ ప్రశాంత్ కుమార్ అన్నారు.

ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక శోభ వద్ద భక్తుల భద్రత కోసం భద్రతా సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉన్నారు. పడవలు, గుర్రాల ద్వారా పెట్రోలింగ్ చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు, యూపీ పోలీసులు ఘాట్ ప్రదేశాలలో భారీగా మోహరించారు.

Read Also : Maha Kumbh Mela 2025 : మహాకుంభమేళా కోసం గూగుల్ గౌరవవందనం.. ఇలా సెర్చ్ చేస్తే పూల జల్లు కురుస్తుంది..!