Srisailam : శ్రీశైలంలో సహస్ర దీపార్చన, వీరభద్రుడికి ప్రత్యేక పూజలు

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.

 Saharsa Deeparchana : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. 2021, సెప్టెంబర్ 06వ తేదీ సోమవారం లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ…దీపాలంకరణ సేవ నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ఈఓ లవన్న వెల్లడించారు.

Read More : Srisailam : ఈ నెల 28 నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం..

స్వామి వార్లను ఊయలలో వేంచేసి…మహాసంకల్పాన్ని పఠించారు వేద పండితులు. 1008 దీపాలను ఈ సందర్భంగా వెలిగించారు. దీపార్చన, పల్లకీ సేవను నిర్వహించారు. ఇక కోవిడ్ నిబంధనల మధ్య స్వామి అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. క్యూ లైన్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. మాస్క్ లు ధరించి వచ్చిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశ దర్శనం కల్పిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.

Read More : Srisailam Temple : శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

అమవాస్య సందర్భంగా…శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమవాస్య ప్రదోషకాల సమయంలో…పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ, విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధ ద్రవ్యాలు, శుధ్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి అమవాస్య సాయంకాలం…అభిషేక కార్యక్రమంలో గోత్రనామాలతో అర్చన పరోక్ష సేవలో పాల్గొనేందుకు భక్తులు srisailadevasthanam.org వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈఓ లవన్న సూచించారు.

ట్రెండింగ్ వార్తలు