108 Divya Kshetram : అంగరంగ వైభవంగా ఉత్సవమూర్తులకు ప్రాణ ప్రతిష్ట

జై శ్రీమన్నారయణ నినాదాలతో శ్రీరామనగరం మారుమ్రోగింది. అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు...

108 Divya Kshetram : అంగరంగ వైభవంగా ఉత్సవమూర్తులకు ప్రాణ ప్రతిష్ట

108 Divya

Updated On : February 7, 2022 / 10:12 AM IST

Samantha Murthy 108 Divya Kshetram : ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో మరో ప్రముఖ ఘట్టం పూర్తయ్యింది. దివ్య దేశ క్షేత్రాల్లో ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేశారు. జై శ్రీమన్నారయణ నినాదాలతో శ్రీరామనగరం మారుమ్రోగింది. అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అర్చకులు మంత్రాలు జపిస్తుండగా.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ, ఇతర స్వామీజీలు ముందుకు నడుస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను రుత్విజులు తీసుకొచ్చారు.

Read More : Parliament Meetings: లతా మంగేష్కర్ కు పార్లమెంటులో నివాళి

యాగశాల నుంచి సమతమూర్తి వరకు నడుచుకుంటూ వచ్చారు. అనంతరం వేద మంత్రాల నడుమ ఉత్సవమూర్తులకు ప్రాణ ప్రతిష్ట చేశారు. అంతకుముందు.. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి వారు యాగశాల నుంచి రుత్విజ్ఞులతో కలిసి ర్యాలీగా సమతామూర్తి ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం సమతామూర్తి ప్రాంగణంలోని దివ్య దేశాలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. యాగశాలలో 108 దివ్య దేశాల్లో మూర్తుల సంఖ్యను ముందుగానే నిర్ణయించారు. ఆయా యాగశాలలో ఉన్న కుంభాలను తీసుకొచ్చారు. ఆలయానికి శ్రీమూర్తులను చేర్చారు.

Read More : India Covid : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 32 రోజుల తర్వాత లక్షలోపు కేసులు

ముచ్చింతల్ మురిసిపోతోంది. భక్తి ప్రవత్తులతో శ్రీరామనగరంలో జరుగుతున్న యాగాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుండడంతో సందడి సందడిగా మారింది. 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం సహస్రాబ్ది వేడుకలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించనున్నారు. వీటితోపాటు ప్రముఖులచే ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా ముచ్చింతల్ కు రానున్నారు.