దీపావళి బంపర్ ఆఫర్ : రూ.1కే చొక్కా, రూ.10 కే నైటీ

  • Published By: chvmurthy ,Published On : October 27, 2019 / 05:28 AM IST
దీపావళి బంపర్ ఆఫర్ : రూ.1కే చొక్కా, రూ.10 కే నైటీ

Updated On : October 27, 2019 / 5:28 AM IST

దీపావళి పండుగకి పేదవారు కూడా ఖరీదైన బట్టలు  వేసుకోవాలనే ఉద్దేశ్యంతో తమిళనాడులో ఓ బట్టల దుకాణం లో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. ఒక రూపాయికి చొక్కా, 10 రూపాయలకు  నైటీ  విక్రయించారు.  

చెన్నైలోని చాకలి పేట లో బట్టల కొట్టు నడిపే ఆనంద్ అనే వ్యాపారి ఈ డిస్కౌంట్ఇచ్చాడు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 19 నుంచి 26 వరకు ఉదయం 10 నుంచి 11 దాకా ఈ డిస్కౌంట్ దుస్తులు అమ్మాడు. మొదట కొన్ని రోజులు 50 మందికి మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చాడు. రాను రాను రద్దీ పెరగటంతో 200 మందికి ముందుగా టోకెన్లు మంజూరు చేయటం మొదలెట్టాడు.

టోకెన్ల కోసం తెల్లవారుఝూము నుంచే షాపు ముందు క్యూ కట్టి టోకెన్లు తీసుకున్నారు. ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదని రూపాయికే చొక్కా, రూ.10 కి నైటీ అమ్మినట్లు ఆనంద్ చెప్పాడు.