Tirumala : తిరుమలలో బ్రేక్ దర్శనాలు పునరుధ్ధరణ

తిరుమలలో పూర్వపు పరిస్థితి నెలకొందని....నేటి నుండి విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునరుద్ధరించినట్లు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

Tirumala : తిరుమలలో  బ్రేక్ దర్శనాలు పునరుధ్ధరణ

Ttd Addl Eo Dharna Reddy

Updated On : April 18, 2022 / 1:48 PM IST

Tirumala :  తిరుమలలో పూర్వపు పరిస్థితి నెలకొందని….నేటి నుండి విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునరుద్ధరించినట్లు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. స్లాటెడ్ సర్వదర్శనం మళ్ళీ అమలు చేసి యోచనలో ఉన్నామని ఆయన చెప్పారు. గత 7 రోజుల్లో 46,419 వాహానాలు కొండపైకి వచ్చాయని…హుండీ ఆదాయం మొత్తం రూ.32.49 కోట్లు వచ్చిందని వివరించారు.

ఏప్రిల్ 12 నుండి రెండు రకాల దర్శనాలు అమల్లో ఉన్నాయని… ధర్మ దర్శనానికి వైకుంఠంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు దర్శనం చేయిస్తున్నామన్నారు.  ధర్మ దర్శనానికి 8 నుండి 9 గంటల్లో దర్శనం లభిస్తోందని ధర్మారెడ్డి చెప్పారు. ప్రస్తుత సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్లాటెడ్ సర్వదర్శనంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. స్లాట్ దొరకని భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో వేచివుండి దర్శించుకునే పద్ధతిని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

శ్రీవారి మెట్టు నడకమార్గం అందుబాటులో వచ్చాక, కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను కేటాయిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోందని.. టీటీడీ సిబ్బంది అన్ని ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉన్నారని ఆయన వివరించారు.  ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు 5,29,966 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాం అని ఆయన అన్నారు. లగేజీ కేంద్రాల నిర్వహణ కాంట్రాక్టును ప్రవేటు కంపెనీకు త్వరలో ఇవ్వనున్నామని ధర్మారెడ్డి చెప్పారు.
Also Read : Kodali Nani : పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి కొడాలి నాని
ఏప్రిల్ 12 వ తేదీ నుండి టిక్కెట్టు లేని భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నామని…క్యూలైన్లు, కంపార్టమెంట్లలో నిర్విరామంగా అన్నపానీయాలు, పాలు అందజేస్తున్నట్లు అదనపు ఈఓ తెలిపారు. సర్వదర్శనం భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనభాగ్యం కల్పిస్తున్నాము కనుక ఎలాంటి అపోహలకు తావివ్వకుండా భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు.