Mesha Rasi Phalalu 2026: మేష రాశిపై ఏలినాటి శని ప్రభావం… ఆ ఒక్క పని చేస్తే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు..!
Mesha Rasi Phalalu 2026: 2026 పరిభవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 mesha rasi phalalu aries horoscope
హిందూ పురాణాల ప్రకారం, తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. 2026-2027 హిందూ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 19, గురువారం నాడు వస్తుంది. ఈ ఏడాది మనం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఉగాది పండుగ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చే వాటిల్లో ముఖ్యమైనవి పంచాంగ శ్రవణం, అలాగే ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు.ఉగాది పండుగ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు 2026-27 సంవత్సరానికి సంబంధించి రాశుల వారీగా ఫలితాలను తెలిపారు. మరి 2026 సంవత్సరంలో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది.. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి.. ఈ రాశి వారు పూజించాల్సిన దేవతలు, పాటించాల్సిన నియమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల పనులు సకాలంలో పూర్తి కావని, ఆటంకాలు ఎదురవుతాయని, కనుక సహనంతో వేచి ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.ఆదాయం: 11వ్యయం: 5రాజపూజ్యం: 2అవమానం: 5ముఖ్యమైన స్థితిగతులుమేష రాశి వారిపై ఏలినాటి శని ప్రభావంతో పాటు రాహు కేతువుల బలం తక్కువగా ఉండటం వల్ల ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే ఈ సంవత్సరం మేష రాశి వారు ఓపికగా ఉండాలి. ఈ ఏడాది మేష రాశి వారి ఆదాయం బాగున్నా, దానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి. అందుకే ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, లేదంటే విరోధాలు తలెత్తే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల బద్ధకంగా ఉంటారని, ఉత్సాహం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళనలు అప్పుడప్పుడు చికాకు కలిగిస్తాయి.
రంగాల వారీగా ఫలితాలు
- విద్యార్థులు: ఈ సంవత్సరం మేష రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు సాధిస్తారు. కనుక బద్ధకాన్ని వీడి కష్టపడితేనే అనుకున్న కోర్సులకు సంబంధించిన పరీక్షల్లో సీట్లు సాధించగలుగుతారు.
- ఉద్యోగస్థులు: దూకుడుతనం తగ్గించుకుని అధికారులతో అనుకూలంగా ఉండాలి. పని భారం ఎక్కువగా ఉంటుంది.
- నిరుద్యోగులు: ఇంటర్వ్యూలకు బాగా కష్టపడి చదవాలి, సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది మేష రాశి నిరుద్యోగులు కష్టపడితేనే కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కించుకోగలరు.
- వ్యవసాయదారులు: పంటలు ఆలస్యంగా చేతికి వస్తాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులు భారీ మొత్తంలో అప్పులు చేయకుండా అప్రమత్తంగా ఉండాలి.
- వ్యాపారస్తులు: రియల్ ఎస్టేట్, మెషీన్లు, యంత్రాలు, ఇనుము వంటి రంగాల్లో ఉన్నవారు ఈ సంవత్సరం ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.
- కళాకారులు, క్రీడాకారులు: ఈ సంవత్సరం క్రీడాకారులకు, కళాకారులకు పెద్దగా కలిసివచ్చే సూచనలు కనిపించడం లేదని పండితులు చెబుతున్నారు. వీరి ప్రతిభ ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. సినీ నిర్మాతలు సాధారణ లాభాలు మాత్రమే పొందుతారు.
- రాజకీయ నాయకులు: ఈ ఏడాది మేష రాశికి చెందిన రాజకీయ నేతలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజల్లో పలుకుబడి తగ్గే ప్రమాదం ఉంది.
- స్త్రీలు: ఈ ఏడాది మేష రాశి స్త్రీలకు కార్యసిద్ధి ఉంటుంది కానీ పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా ఆహార నియమాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
- నక్షత్రం కలిసి వచ్చే నెలలు అదృష్ట వారాలు అదృష్ట సంఖ్యలు
అశ్విని (1-4 పాదాలు) మార్చి, జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి ఆది, గురు, శుక్ర 1, 4, 5, 9 - భరణి (1-4 పాదాలు) మార్చి, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సోమ, బుధ, గురు 4, 6, 7, 9
- కృత్తిక (1వ పాదం) మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి బుధ, శుక్ర, శని 3, 4, 5, 9
పరిహారాలు, దైవ ప్రార్థనగ్రహ జపాలు:
ఉగాది తర్వాత శని, రాహు, కేతువులకు జపాలు చేయించుకుని నల్ల నువ్వులు, మినుములు, ఉలవలు దానం ఇవ్వాలి.స్తోత్ర పఠనం: మేష రాశి వారు ప్రతిరోజూ కనకధారా స్తోత్రం, సంకటనాశక గణేశ స్తోత్రము చదివినా, విన్నా.. విఘ్నాలు తొలగిపోతాయి.
ముఖ్య సూచన: ఈ సంవత్సరం మేష రాశి వారు “కష్టే ఫలి” అనే సూక్తిని నమ్ముకుని సహనంతో ముందడుగు వేస్తే జీవితం సాఫీగా సాగిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
