Venus Transit Malavya Yoga : ఇవాళ్టి నుంచే మీనరాశిలోకి శుక్రుడు.. ఇది మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి లక్కే లక్కు..!

శుక్రగ్రహం మీనరాశిలో అడుగుపెట్టిన సందర్భంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం

Venus Transit Malavya Yoga : ఇవాళ్టి నుంచే మీనరాశిలోకి శుక్రుడు.. ఇది మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి లక్కే లక్కు..!

Venus will enter pisces for malavya yoga

Updated On : January 28, 2025 / 1:45 PM IST

Venus Transit Malavya Yoga : గ్రహాల స్థితిగతులు ఎప్పుడూ ఒకేలా ఉండాయి. సమయాన్ని బట్టి ఆయా వేళల్లో స్థానాలను మారుతుంటాయి. ప్రతినెలలో గ్రహాలకు ఒక నిర్ది్ష్ట సమయం ఉంటుంది. ఆయా సమయం ప్రకారమే ఎన్నో మార్పులు వస్తుంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పరిశీలిస్తే.. శుక్ర గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ శుక్ర గ్రహంలో జీవితంలో ఆనందాలను వెల్లువిరుస్తుందని నమ్ముతారు. వాస్తవానికి, ఈ శుక్రుడు జనవరి 28న కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.

Read Also : Vastu Shastra Tips : ఈ రెండు దిశలలో మొక్కలు ఎందుకు ఉంచకూడదో తెలుసా? వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే?

ఉదయం 7:02 గంటలకు మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. మే 31వ తేదీ వరకు ఇక్కడే సంచారించనున్నాడు. తద్వారా మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. అందులోనూ జనవరి 29న మౌని అమావాస్య మొదలుకానుంది. మీనరాశిలోకి శుక్రుడు ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులలో ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం పొందుతారు. శుక్రుడి వల్ల ఇంకా ఏయే రాశులకు అదృష్టాన్ని తీసుకురానుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : మాలవ్య రాజయోగంతో మేషరాశి వారికి కలిసి వస్తుంది. మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు అయితే నచ్చిన చోటకు ఉద్యోగం బదిలీ అవుతారు. వారి వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు తగ్గవచ్చు. ఈ రాశివారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. జీవితంలో ఎంతో సాధిస్తారు. విద్యార్థులు అయితే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

సింహరాశి : సింహరాశి వారికి కూడా అన్ని శుభాలే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వీరికి అదృష్టం కూడా కలిసి రానుంది. ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంది. ప్రేమ వివాహం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. వీరి ప్రేమవివాహానికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంటుంది. ఇప్పటివరకూ ఉన్న కుటుంబ సభ్యుల విభేదాలు సైతం తొలగిపోతాయి. ఎప్పటినుంచో కొనాలనుకునే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది.

Read Also : Adrustam : చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా? పూజ చేయొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..

కుంభరాశి :
కుంభరాశి వారికి కూడా శుక్రుడు అనేక శుభఫలితాలను అందిస్తాడు. కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మాలవ్యయోగంతో అనుకూలంగానే ఉంటాడు. ఈ రాశివారికి ఆర్థికంగా కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యాపారాల విస్తరణకు కూడా మంచి సమయంగా చెప్పవచ్చు.

వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు తొందరగా ప్రమోషన్ కూడా వస్తుంది. అలాగే వేతనం కూడా పెరగవచ్చు. ఆర్థిక కష్టాలు సమసిపోతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్నిచోట్ల లాభాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నవారికి మంచి పొజిషన్ దక్కే అవకాశం కనిపిస్తుంది.