Adrustam : చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా? పూజ చేయొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..
తల్లిదండ్రులు దేవతలతో సమానమే. కానీ, వారు చనిపోయినటువంటి సమయం అనేది కీడు, అశుభప్రదమైనది.

Adrustam : ఎవరైనా చనిపోతే వారి ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? అసలు ఎవరి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి, ఎవరి ఫోటోలు పెట్టుకోకూడదు? మరణించిన వారి ఫోటోలను పూజా మందిరంలో పెట్టొచ్చా? అలా చేస్తే శుభప్రదమా? అరిష్టమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? ప్రముఖ వాస్తు, జ్యోతిష్య ప్రవచన పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి మాటల్లో తెలుసుకుందాం..
జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవతలతో సమానం కనుక చనిపోయిన తర్వాత వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చని వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. అయితే, పర్టికులర్ గా ఈ వారాల్లో, ఈ తిథుల్లో చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదని ఆయన తేల్చి చెప్పారు. వారి ఫోటోలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
”మాతా పిత్రులు దేవతలతో సమానం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి దేవతలతో సమానమైన వారేనని చెప్పి ఇంట్లో పూజా మందిరంలో వారి ఫోటోలు పెట్టుకుని పూజించడం కరెక్టే. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వారి ఫోటోలు పెట్టుకోవచ్చా లేదా అనే అనుమాన పడాల్సిన అవసరమూ లేదు. అయితే, ఆదివారం అమావాస్య, మంగళవారం అమావాస్య, శనివారం అమావాస్య రోజున చనిపోయినట్లు అయితే.. ఆ తల్లిదండ్రుల ఫోటోలను దేవుడి దగ్గర పెట్టకూడదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇంట్లో పెట్టినా.. నిత్యం వాటిని చూడకూడదు.
తల్లిదండ్రులు దేవతలతో సమానమే. కానీ, వారు చనిపోయినటువంటి సమయం అనేది కీడు, అశుభప్రదమైనది. ఈ వారాల్లో, ఈ తిథుల్లో చనిపోతే.. శాంతి హోమం జరిపించాలి. అదే ఉదగ శాంతి హోమం. శివుడికి సంబంధించి రుద్రాభిషేకం చేయించాలి. మృత్యుంజయ హోమం జరిపించాలి. అలా చేసినా వారి ఫోటోలు మాత్రం ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే అశుభ సమయంలో చనిపోయారు కనుక.
అశుభ సమయంలో చనిపోయినట్లు అయితే.. ఏడాదిలోపు ఆ ఇంట్లో మళ్లీ ఒక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరక్కూడదని చెప్పి ఉదక శాంతి హోమం జరిపించాలి. అలా చేస్తే ఆ ఇంట్లో మళ్లీ నష్టం జరగదు. ఆ ఇంటిల్లి పాది శుభంగానే ఉంటుంది. ఇది ఆత్మశాంతి కోసం చేసే పూజా కార్యక్రమం. ఇది చేస్తే ఆ ఇంటిల్లిపాది అంతా సంతోషంగా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీతో శుభప్రదంగా ఆ ఇల్లు కొనసాగుతుంది.
ఇక, ఆ సమయంలో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడా పెట్టకూడదు. పెట్టినా నిత్యం చూడకూడదు. అసలు ఇంట్లోనే ఉండకూడదు. వాస్తు, జాతకం ప్రకారం వారి ఫోటోలు ఇంట్లో ఉండకూడదు. అది దోషం.
మిగతా సమయాల్లో చనిపోయిన వారి ఫోటోలను మాత్రం ఇంట్లో పెట్టుకోవచ్చు. శాంతి హోమం కూడా జరిపించాల్సిన అవసరం లేదు. ఇక, మరో ప్రధానమైన విషయం.. తల్లిదండ్రులు ఫోటోలు మాత్రమే పూజా మందరిలో పెట్టుకోవచ్చు. మిగతా వారివి పెట్టకూడదు. దేవుడి పూజా మందరిలో తల్లిదండ్రులు ఫోటోలు మాత్రమే ఉండాలి. అన్నదమ్ములవి, భార్యవి, పిల్లలవి ఫోటోలు పెట్టుకోకూడదు. తల్లిదండ్రుల ఫోటోలు మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా దక్షిణం గోడకు పెట్టుకుని ఉత్తర ముఖం చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు శనివారం, ఆదివారం, లేదా మంగళవారం దూపం ఇవ్వడం శుభప్రదం” అని ప్రముఖ వాస్తు, జ్యోతిష్య ప్రవచన పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు..
Also Read : ఇంట్లో నల్ల చీమలు తిరిగితే ధనవంతులు అవుతారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..