Adrustam Black Ants : ఇంట్లో నల్ల చీమలు తిరిగితే ధనవంతులు అవుతారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..

నల్ల చీమలు ఏ విధంగా శుభప్రదం, ఇంట్లో నల్ల చీమలు తిరిగితే ఎలాంటి అదృష్టం పడుతుంది? నల్ల చీమలు తిరగడం వల్ల ధనవంతులు అవుతారా?

Adrustam Black Ants : ఇంట్లో నల్ల చీమలు తిరిగితే ధనవంతులు అవుతారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..

Updated On : January 24, 2025 / 4:45 PM IST

Adrustam Black Ants : సాధారణంగా ఇళ్లలో చీమలు తిరుగుతుంటాయి. నల్ల చీమలు, ఎర్ర చీమలు, గండు చీమలు.. ఇలా రకాల రకాల చీమలు మనకు ఇళ్లలో దర్శనం ఇస్తుంటాయి. ఇళ్లలో చీమలు ఉండటం చాలా కామన్. అయితే, చీమల వల్ల అనేక సమస్యలు, నష్టాలు ఉన్నాయని అంతా భయపడతారు. అవి ఆహార పదార్దాలను పాడు చేస్తాయని ఆందోళన చెందుతారు.

అంతేకాదు వాటి వల్ల కొన్ని సందర్భాల్లో ఇంట్లో గోడలు కూడా దెబ్బతింటాయనే భయమూ ఉంది. అందుకే, చీమలు కనిపిస్తే చాలు వెంటనే వాటిని చంపాలని చాలామంది చూస్తారు. ఎక్కడ చీమలు కనిపిస్తే అక్కడ చీమల పొడి చల్లేస్తారు. లేదా లక్ష్మణ రేఖ గీస్తారు. అలా చీమలను తరిమి కొడతారు. చీమల వల్ల నష్టం తప్ప మరొకటి ఉండదన్నది అందరి ఫీలింగ్. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం నల్ల చీమల వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఏ ఇంట్లో నల్ల చీమలు ఉంటే అక్కడ శుభప్రదం అంటున్నారు. ఆ ఇంట్లో వాళ్లు అభివృద్ధిలోకి వస్తారని వాస్తు పండితులు చెబుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నల్ల చీమల ఇంట్లోకి వచ్చాయంటే.. ఆ ఇంట్లో వాళ్లకు అదృష్టం పట్టినట్లే అంటున్నారు.

Also Read : వాస్తు ప్రకారం ఇంట్లో వాష్ రూమ్స్ ఏ దిక్కున ఉండాలి?

నల్ల చీమలు ఏ విధంగా శుభప్రదం, ఇంట్లో నల్ల చీమలు తిరిగితే ఎలాంటి అదృష్టం పడుతుంది? నల్ల చీమలు తిరగడం వల్ల ధనవంతులు అవుతారా? ప్రముఖ వాస్తు, జ్యోతిష్య ప్రవచన పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి మాటల్లో తెలుసుకుందాం..

”నల్ల చీమలు గుడ్లు పెట్టుకుని విపరీతంగా అంటే గుంపులు గుంపులుగా వందల్లో, వేలల్లో, లక్షల్లో నల్ల చీమలు మనకు కనపడినా, అవి మన ఇంట్లో తిరుగుతూ ఉన్నా అత్యంత శుభప్రదం. అవి గుడ్లు పెట్టుకుని గుడ్లు మోస్తూ ఉండటం, వాటి సంఖ్య వృద్ది చెందటం అంటే.. ఆ ఇంట్లో వాళ్లు అత్యంత వేగంగా పురుష సంతానం అంటే పుత్ర సంతానం కలుగుతుంది.

ఆ ఇంట్లో వారు అంతే అభివృద్ధి చెందుతారు. అలాగే వంశం అభివృద్ధి చెందటం, వాళ్లు చక్కగా అన్ని రంగాల్లో వృద్ధి చెందటం, ఆర్థికపరంగానూ వాళ్లు తొందరగా అభివృద్ధి చెందుతారు. చీమలు గుడ్లను ఎలా మోసుకుని పోతున్నాయో.. అలాగే ప్రతి నిత్యం ధనాన్ని మోస్తూ ఉండటమే. అది బంగారం కావొచ్చు, డబ్బు కావొచ్చు. వెండి, పసిడి వంటి లోహాలను సమకూర్చుకుంటారు.

ఇలా చీమలు అనేవి మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి. ఆర్థిక యోగాన్ని కూడా కలగజేస్తాయి. మన వంశం, సంఘాన్ని కూడా అభివృద్ది చేసేంత దిశగా అభివృద్ది జరుగుతుంది. ఎక్కడైతే నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ అంతా పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. మనకు అదృష్టం పట్టినట్లే” అని ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.

 

Also Read : వాస్తు రీత్యా డబ్బును ఇంట్లో ఏ దిక్కున దాచుకోవాలి? ఇనుప బీరువాలో ధనం పెట్టకూడదా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..