Washroom Area : వాస్తు ప్రకారం ఇంట్లో వాష్ రూమ్స్ ఏ దిక్కున ఉండాలి?

ఇంట్లో బాత్ రూమ్ ఉండాల్సిన ప్లేస్ లో ఉండకపోతే ఏమవుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి?

Washroom Area : వాస్తు ప్రకారం ఇంట్లో వాష్ రూమ్స్ ఏ దిక్కున ఉండాలి?

Updated On : January 22, 2025 / 11:22 PM IST

Washroom Area : ఇంట్లో వాష్ రూమ్ కి వాస్తు ఉంటుందా? ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బాత్ రూమ్ కానీ, వాష్ ఏరియా కానీ కట్టకూడదా? వాస్తు ప్రకారం వాష్ రూమ్స్, వాష్ ఏరియాలు లేకపోతే నష్టాలు తప్పవా? ఇంట్లో ఇబ్బందులు రావడం ఖాయమా? అంటే.. అవుననే అంటున్నారు వాస్తు పండితులు. ఇంట్లో ప్రతి దానికి వాస్తు అవసరమే అంటున్నారు. వాష్ రూమే కదా ఏదో ఒక మూల కట్టిస్తే సరిపోతుందని అనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదంటున్నారు.

మరి వాస్తు ప్రకారం ఇంట్లో వాష్ రూమ్స్ ఎక్కడ ఉండాలి? బాత్ రూమ్ ఉండాల్సిన ప్లేస్ లో ఉండకపోతే ఏమవుతుంది? ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయి? వాస్తు, జ్యోతిష్య ప్రవచన పండితులు.. దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి మాటల్లో తెలుసుకుందాం..

”చాలా మంది వారికి ఇష్టం వచ్చినట్లు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వాష్ రూమ్స్ కట్టించుకుంటారు. కొంతమంది వాస్తు పండితులు.. బుక్స్ చదువుకుని వచ్చిన వారు.. తమకు తోచిన విధంగా చెబుతుంటారు. ఆగ్నేయంలో వాష్ రూమ్ కట్టుకోవచ్చని చెబుతున్నారు. లేదా వాయువ్యంలో కట్టుకోవచ్చని అంటున్నారు. కానీ, అది కరెక్ట్ కాదు. మరికొందరు సంపూర్ణ అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ బాత్ రూమ్స్ పెట్టుకునేలా ఇంటి ప్లాన్ ఇస్తున్నారు.

అసలు బాత్రూమ్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండకూడదు? అనేది మనం పాటించాలి. వాష్ రూమ్ ఉండాల్సిన చోట ఉన్నప్పుడే ఇంటికి అందంగా ఉంటుంది. ఇంట్లో మురికి ఏ స్థానంలో ఉంటే బాగుంటుందో అక్కడే ఉండాలి” అని దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.

”వాష్ రూమ్ ఆగ్నేయంలో కట్టుకోవచ్చని కొందరు చెప్పుకుంటున్నారు. కొందరు వద్దని చెబుతున్నారు. వాస్తు ప్రకారం.. ఇంట్లో వాష్ రూమ్ ఆగ్నేయంలో ఉండకూడదు. ఆగ్నేయం అనేది అగ్ని, అగ్నిహోత్రుడు. నిత్యం అక్కడ మనం వంట చేసుకునే స్థానం. నిత్యం అక్కడ హోమం జరిగే ప్రదేశం. వాస్తు శాస్త్ర రిత్యా అగ్ని దేవుడి నివాస స్థానం ఆగ్నేయం.

Also Read : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. ఈ ప్లాన్లపై మొబైల్ డేటా ఫసక్.. కానీ, ఇలాంటి వాళ్లకు లాభం..!

”అక్కడ వాష్ రూమ్ అనేది పెట్టడం వల్ల నీళ్లు పడుతూ ఉంటాయి. నిత్యం అగ్ని ఉండాల్సిన స్థానం, నిత్యం అగ్ని ప్రజ్వలించే స్థానంలో నీళ్లు పడుతూ ఉంటే.. ఆ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి. క్షణికావేశానికి లోనవుతారు. ఒకరి మీద ఒకరు ర్యాష్ గా మాట్లాడుకోవడం, గొడవ పడి, కొట్టుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత ఇలా ఎందుకు జరుగుతుందా? అనే ఆలోచన కలుగుతుంది. దానికి కారణం ఆగ్నేయంలో బాత్ రూమ్ కట్టడమే.

ఆగ్నేయంలో మరుగు దొడ్డి ఉండటం వల్ల ఇంటి యజమానికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా ఆ ఇంట్లో ఉన్న వారికి కోపం, ఆవేశం, తొందరపాటుతనం వస్తాయి. ఇంట్లో వాళ్లకి ప్రశాంతత ఉండదు. భయం, కంగారు, టెన్షన్ ఉంటాయి. నిద్ర పట్టదు. దక్షిణ ఆగ్నేయంలో వాష్ ఏరియా కానీ వాష్ రూమ్ కానీ కట్టరాదు. ఈస్ట్ ఆగ్నేయంలో వాష్ రూమ్ కానీ, వాష్ ఏరియా కానీ కట్టకూడదు. ఏది ఏమైనా వాస్తు రిత్యా ఆగ్నేయంలో వాష్ రూమ్ అనేది నిషేధం. అది ఇంటి లోపల కావొచ్చు, ఇంటి బయట కావొచ్చు” అని దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.

”ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వాష్ రూమ్ కడితే పర్యవసానం అనుభవించాల్సిందే. వాస్తు రిత్యా వాష్ రూమ్ అనేది ఇంటి బయటే ఉండాలి. మనం కట్టుకునే ఇంట్లో ఉండకూడదు. స్థలం ఉన్నప్పుడు ఇంటి బయట బాత్రూమ్ కట్టుకోవడం చాలా మంచిది. వాస్తు రిత్యా మరుగు దొడ్లు, వాష్ ఏరియాలు.. అన్నీ ఇంటి బయటే ఉండాలి. వాస్తు రిత్యా మరుగు దొడ్లు, వాష్ ఏరియాలు, బాత్రూమ్ లు.. ఇలాంటివన్నీ ఇంట్లో ఉత్తర వాయివ్యంలో ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ గుంత కానీ మురుగునీరు స్టోరేజ్ కానీ వాస్తు రిత్యా అక్కడ మాత్రమే ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ అనేది వాయువ్యం మూల మాత్రమే కట్టుకోవాలి. కార్నర్ లో మాత్రమే పెట్టాలి.

ఇక, నాలుగు భాగాల్లో ఎక్కడా కట్టకూడదు. ఆగ్నేయం, నైరుతి మూలలో, ఈశాన్య కార్నర్ లోనూ కట్టకూడదు. వాయివ్యం కార్నర్ లో మాత్రమే బాత్ రూమ్ లు కానీ, సెప్టిక్ ట్యాంక్ గుంతలు కానీ, వాష్ ఏరియాలు కానీ కట్టుకోవాలి. ఇవన్నీ ఉత్తర భాగంలోనే ఉండాలి. పడమర కు ఉండకూడదు. వాయువ్యంలో కూడా వెస్ట్ కి ఉండకూడదు. నార్త్ కు మాత్రమే ఉండాలి.

వాయివ్యంలో ఒక బాత్ రూమ్ కట్టుకున్నాం. ఇంకో బాత్ రూమ్ కూడా కట్టుకోవాలి అంటే.. దక్షిణ భాగంలో మన ఇంట్లో మధ్య భాగంలో అంటే దక్షిణం సైడ్ మధ్య భాగంలో కట్టుకోవచ్చు. లేదా పడమర వాయువ్యం, నైరుతి, మధ్య భాగంలో కట్టుకోవచ్చు. వాష్ ఏరియా కట్టుకోవడానికి మూడు స్థానాలే ఉంటాయి. దక్షిణ మధ్య భాగం, పడమర మధ్య భాగం, లేదా వాయువ్య భాగంలో మాత్రమే వాష్ రూమ్స్ కట్టుకోవాలి” అని దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.

 

 

Also Read : క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు చేస్తారా? మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలా యాక్టివేట్ చేస్తే సరి.. ఇదిగో ప్రాసెస్..!