UPI on Credit Card : క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు చేస్తారా? మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలా యాక్టివేట్ చేస్తే సరి.. ఇదిగో ప్రాసెస్..!
UPI on Credit Card : మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. మీ క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ లింక్ చేయవచ్చు. తద్వారా ఇతరయూపీఐ యాప్స్ ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.

UPI on Credit Card
UPI on Credit Card : ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వాడకం అనేది సర్వసాధారణంగా మారింది. సాధారణ ఉద్యోగుల దగ్గర నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. డిజిటల్ పేమెంట్లు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం అనేది ఒక ప్రమాణంగా మారింది. అదే సమయంలో, యూపీఐ ద్వారా పేమెంట్లు చేయడం కూడా అదే స్థాయిలో పెరిగాయి. డెబిట్ కార్డ్ పేమెంట్లను యూపీఐ అధిగమించింది.
యూపీఐ పేమెంట్ల విలువ అక్టోబర్ 2023లో రూ. 17.15 లక్షల కోట్ల నుంచి 2024 అక్టోబర్‌లో రూ. 23.49 లక్షల కోట్లకు పెరిగింది. ఒక ఏడాదిలో దాదాపు 37 శాతం పెరిగింది. అదే సమయంలో, డెబిట్ కార్డ్ లావాదేవీల విలువ రూ. 52వేల కోట్ల నుంచి రూ. 46,920 కోట్లకు క్షీణించింది. దాదాపు 10 శాతం పతనాన్ని సూచిస్తుంది. అయితే, ఇందులో మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ లింక్ చేయవచ్చు. తద్వారా పేమెంట్ ఈజీగా చేయవచ్చు. జూన్ 2022లో క్రెడిట్ లైన్ల ద్వారా యూపీఐ పేమెంట్లను ఆర్బీఐ ఆమోదించింది.
మీరు క్రెడిట్ కార్డుపై యూపీఐ యాక్టివేట్ చేయాలని అనుకుంటున్నారా? మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. సింపుల్‌గా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి ఇతర యూపీఐ యాప్స్ కు లింక్ చేసుకోవచ్చు. తద్వారా సింపుల్‌గా మీ లావాదేవీలను సులభంగా పూర్తి చేయొచ్చు.
యూపీఐ రూపే క్రెడిట్ కార్డులో 22 బ్యాంకులు :
అప్పటి నుంచి బ్యాంకింగ్ ఛానెల్‌లలో విస్తృతంగా విస్తరించారు. ప్రస్తుతం, 22 బ్యాంకులు యూపీఐలో (RuPay) క్రెడిట్ కార్డ్‌కు సపోర్టు చేస్తున్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.
మీరు BHIM, PhonePe, GPay, PayZapp, GoKIWI, Slice, Paytm, MobiKwik, BHIM PNB, Canara Ai1, Groww, Cred, ICICIiMobile, Navi, Sriram Finance, FreeCharge, Amazon Pay వంటి ఏదైనా యూపీఐ యాప్‌లలో మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేయవచ్చు.
ఎలా యాక్టివేట్ చేయాలంటే? :
1. ముందుగా, మీరు ప్లేస్టోర్ నుంచి (BHIM) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేసి, క్రెడిట్ కార్డ్‌ని ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
3. డ్రాప్ డౌన్ నుంచి జారీ చేసే బ్యాంక్ పేరును ఎంచుకోండి.
4. మీ బ్యాంక్‌తో మొబైల్ నంబర్ అప్‌డేట్ ఆధారంగా మాస్క్‌డ్ క్రెడిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5. ఇప్పుడు మీరు లింక్ చేసే కార్డ్‌ని ఎంచుకోవచ్చు.
6. ఇప్పుడు మీరు (UPI PIN)ని క్రియేట్ చేయొచ్చు.
7. ఆ తర్వాత, మీరు డ్రాప్‌డౌన్ మెను నుంచి ‘Change UPI PIN’ని ఎంచుకోవడం ద్వారా మీ క్రెడిట్ కార్డ్ యూపీఐ పిన్ మార్చవచ్చు.