Adrustam : వాస్తు రీత్యా డబ్బును ఇంట్లో ఏ దిక్కున దాచుకోవాలి? ఇనుప బీరువాలో ధనం పెట్టకూడదా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

చాలామంది ఇనుప బీరువాల్లో డబ్బు పెడుతుంటారు. కానీ, అలా పెట్టకూడదు. ఎందుకంటే..

Adrustam : వాస్తు రీత్యా డబ్బును ఇంట్లో ఏ దిక్కున దాచుకోవాలి? ఇనుప బీరువాలో ధనం పెట్టకూడదా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

Updated On : January 24, 2025 / 10:40 AM IST

Adrustam : వాస్తు రిత్యా డబ్బును ఇంట్లో ఏ దిక్కున దాచుకోవాలి? ఇనుప బీరువాలో ధనం పెట్టకూడదా? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి. వీటికి సరైన సమాధానం దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. కొందరైతే.. ఎక్కడైతే ఏముందిలే అని లైట్ తీసుకునే వాళ్లూ ఉన్నారు. కానీ, అలా చేయడం వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు వాస్తు నిపుణులు. వాస్తు రిత్యా డబ్బును ఇంట్లో ఏ దిక్కున ఉంచుకోవాలి? ఇనుప బీరువాలో ధనం ఎందుకు పెట్టకూడదు? అనే అంశాలపై ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి మాటల్లో తెలుసుకుందాం..

”ఏ రాశి వారు అయినా సరే, ఏ నక్షత్ర జాతకులైనా సరే.. ఇంట్లో ఉత్తరం దిక్కున ధనాన్ని దాచాలి. చాలామంది ఇనుప బీరువాల్లో డబ్బు పెడుతుంటారు. కానీ, అలా పెట్టకూడదు. బంగారం అయినా సరే, డబ్బు అయినా సరే.. ఇనుప దాంట్లో పెట్టకూడదు. బీరువాని ఐరన్ తో చేస్తారు. ఐరన్ ని ఉత్తరాన పెట్టకూడదు. ఎత్తైనది, బరువైనది కాబట్టి.

Also Read : ఇంట్లో ఈ యంత్రం ఉంచారంటే ఆర్థికంగా ధనవంతులు అవుతారట..!

ఉత్తరం అనేది కుబేర స్థానం, లక్ష్మీ స్థానం. కాబట్టి ఇనుప బీరువాను ఉత్తరంలో పెట్టకూడదు. ఇనుప బీరువాను దక్షిణం లేదా పడమరలోనే పెట్టాలి. ఇనుప బీరువాలో ధనాన్ని ఎందుకు పెట్టకూడంటే ఇనుము శనేశ్వరుడు. ఆయన నివాస స్తానం పడమర స్థానం. ఐరన్ బీరువాలన్నీ పడమర భాగంలో పెట్టుకోవాలి. అది నైరుతి భాగంలో ఉండాలి. తూర్పు ముఖంగా ఉండాలి. పడమర ఆయన నివాస స్థానం. కనుక ఇనుప బీరువాలను నైరుతి భాగంలో పెట్టాలి. సెకండ్ ఆప్షన్ గా ఉత్తర భాగంలో పెట్టుకోవచ్చు.

ధనాన్ని దాచాల్సింది కేవలం ఉత్తర భాగంలో మాత్రమే. ఉత్తరం దిక్కులో మాత్రమే దాచుకోవాలి. కర్ర, చెక్కతో తయారు చేసిన బీరువాన్ని ఉత్తరంలో పెట్టుకోవచ్చు. మనం సింహద్వారాన్ని అంటే గడపను కర్రతో చేసి ప్రతిరోజు పూజిస్తాం. లక్ష్మి నివాస స్థానాలు ప్రధానంగా చెప్పాలి అంటే కర్ర, పాలు, పూలు. ఇవన్నీ లక్ష్మీ నివాసాలు. ప్రధానమైనది కర్ర.

అటువంటి కర్రతో చేసినటువంటి బీరువాను ఉత్తర భాగంలో పెట్టుకుని ధనాన్ని దాచుకోవచ్చు. కర్రతో చేయడం వల్ల అది బరువు కాదు. ఇంకా బెస్ట్ ఏంటంటే.. గోడలోనే కర్రతో బీరువాను ఏర్పాటు చేసుకుని అందులో ధనాన్ని దాచుకోవచ్చు. అలా చేయడం అత్యంత శుభప్రదం. లక్ష్మీ దేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది’ అని ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.

 

Also Read : వాస్తు ప్రకారం ఇంట్లో వాష్ రూమ్స్ ఏ దిక్కున ఉండాలి?