Matsya Yantra Benefits : ఇంట్లో ఈ యంత్రం ఉంచారంటే ఆర్థికంగా ధనవంతులు అవుతారట..!

ఇంటికి ఎదురుగా సంపు పెట్టుకోవడం వాస్తు దోషమే అంటున్నారు వాస్తు, జ్యోతిష్య ప్రవచన పండితులు.. మరి ఆ వాస్తు దోషాన్ని తొలగించడం ఎలా? దీనికి పరిష్కారం ఉందా?

Matsya Yantra Benefits : ఇంట్లో ఈ యంత్రం ఉంచారంటే ఆర్థికంగా ధనవంతులు అవుతారట..!

Updated On : January 22, 2025 / 9:42 PM IST

Matsya Yantra Benefits : ఈ రోజుల్లో డబ్బు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరూ కష్టపడి పని చేసేది డబ్బు సంపాదన కోసమే. అన్ని పనులకు డబ్బే అవసరం. వేర్వేరు పద్ధతుల్లో పనులు చేసి ధనార్జన చేస్తుంటారు. అయితే, ఎంత డబ్బు వచ్చినా కొందరు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతుంటారు. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఆ డబ్బు నిలవదు. ఆర్థికంగా కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఆర్ధికంగా బాగుండాలని, ధనవంతులు అవ్వాలనే ఆశ అందరిలోనూ ఉంటుంది.

కానీ, కొన్ని కారణాల వల్ల అలా జరక్కుండా పోతోంది. అయితే, దీనికి ఒక పరిష్కార మార్గం ఉందంటున్నారు వాస్తు, జ్యోతిష్య పండితులు. ఇంట్లో ఓ యంత్రం ఉంచితే ఆర్థికంగా ధనవంతులు అవతారని చెబుతున్నారు. వాస్తు, జ్యోతిష్య ప్రవచన పండితులు.. దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి మాటల్లో అదెలానో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో నీటి స్టోరేజ్ కి సంపులు ఏర్పాటు చేసుకోవడం కామన్ గా మారింది. దాదాపు ప్రతి ఇంట్లోనూ సంప్ లు ఉన్నాయి. అయితే, ఇలా ఇంటికి ఎదురుగా సంపు పెట్టుకోవడం వాస్తు దోషమే అంటున్నారు వాస్తు, జ్యోతిష్య ప్రవచన పండితులు.. దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి. మరి ఆ వాస్తు దోషాన్ని తొలగించడం ఎలా? దీనికి పరిష్కారం ఉందా? అంటే.. ఉందనే అంటున్నారు. అదే మత్స్య యంత్రం.

Also Read : ఇదేందిది కొత్తగా ఇంకొకటి.. పిల్లలు, యువతలో సడన్‌గా నరాల జబ్బు.. లక్షణాలు ఇవే.. చెక్ చేసుకోండి!

”ఇంటికి ఎదురుగా సంపు వేసుకోవడం వాస్తు దోషమే అవుతుంది. అలాంటి దానికి పరిష్కారమే మత్స్య యంత్రం. గ్రౌండ్ లో నీళ్లను నిల్వ ఉంచుకున్నాం కాబట్టి.. అందులో పంచలోహాలతో చేసిన మత్స్య యంత్రాన్ని సంపులో ఉంచాలి. అది కూడా రెడీ మేడ్ కాకూడదు. ప్రత్యేకంగా చేయించాలి. దానికి మంత్ర జపం చేసి మన ఇంటి కొలతలు తీసుకుని దాని ప్రకారంగా (పద సంఖ్య) మంత్ర జపం చేసి ఆ యంత్రాన్ని సంపులో ఉంచితే విశేషంగా మనకు కలిసి వస్తుంది. ఆ వాస్తు దోషం అనేది వైదొలిగి పోతుంది” అని దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.

మత్స్య యంత్రం..
”పంచ లోహాలతో కలిపిన మెమొరీ చిప్ అనే యంత్రాన్ని సంప్ లో పెట్టాలి. దానిపై బీజాక్షరాలు ఉంటాయి. వాటికి మంత్ర జపం చేయాలి. మన ఇంటి స్థలం మెజర్ మెంట్స్ ప్రకారం మంత్ర జపం చేసి పెట్టాలి. అందులో మత్స్యం కూడా ఉంటుంది. నీళ్లలో ఉండటం వల్ల ఆ యంత్రం జీవం పోసుకుంటుంది. మనకు ఎంత పాజిటివ్ ఎనర్జీ కావాలో అంత ఎనర్జీని ఇంటికి ఇస్తుంది. యంత్రం పవర్ వేల సంవత్సరాల వరకు ఉంటుంది. వాస్తు దోషాలన్నీ ప్రక్షాళన అవుతూనే ఉంటాయి. ఆ నీళ్లలో కూడా ఎనర్జీ ఉంటుంది. ఆ ప్లేస్ కంతా హై ఎనర్జీ ఏర్పడుతుంది” అని దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించారు.

మత్స్య యంత్రం ద్వారా కలిగే లాభాలు..
* ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు
* చర్మ వ్యాధులన్నీ నయం అవుతాయి
* మనశ్శాంతి కలుగుతుంది
* ప్రశాంతత కలుగుతుంది
* ఆర్థికపరమైన అభివృద్ధి కలుగుతుంది

* వ్యాపారం చక్కగా అభివృద్ధి జరుగుతుంది
* చేతి నిండా పనులు వస్తాయి
* విశేషమైన అభివృద్ధి జరుగుతుంది
* ఇంకొక ఇల్లు కట్టుకునే స్థాయికి ఎదుగుతాం
* వాస్తు దోషాన్ని తొలగిస్తుంది

* ఏ టు జెడ్ అన్ని సమస్యలకు చక్కని పరిష్కార మార్గం మత్స్య యంత్రం
* ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది
* అనుకున్న పని వెంటనే జరిగిపోతుంది
* స్థలంలో ఎలాంటి లోపాలున్నా తొలగిపోతాయి
* నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది

* మత్స్య యంత్రం పెట్టడం వల్ల స్థాన బలం ఏర్పడుతుంది
* అన్ని రంగాల్లో అభివృద్ధి
* పిల్లలు విద్యలో రాణిస్తారు, మంచి ఉద్యోగం వస్తుంది

 

Also Read : క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు చేస్తారా? మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలా యాక్టివేట్ చేస్తే సరి.. ఇదిగో ప్రాసెస్..!