Warangal Bhadrakali : భద్రకాళీ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి.

Warangal Bhadrakali
Warangal Bhadrakali : ఓరుగల్లు వాసుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈరోజు ఉదయం కాళీ రూపంలో దర్శనమిచ్చారు, సాయంత్రం కామేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుని కానుకలను సమర్పించారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది