తిరుమల కొండెక్కుతున్న జగన్ 

జగన్‌ కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు.

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 07:09 AM IST
తిరుమల కొండెక్కుతున్న జగన్ 

Updated On : January 10, 2019 / 7:09 AM IST

జగన్‌ కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు.

తిరుపతి : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జవనవరి 10 గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహానికి వచ్చిన ఆయనకు వైసీపీ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి దర్శనం కోసం వచ్చిన జననేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో గెస్ట్‌హౌస్‌ ప్రాంగణం కిక్కిరిసింది.
జగన్‌ మధ్యాహ్నం అలిపిరి వెళ్లి అక్కడి నుంచి కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. ఈ రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు.