టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మిస్టరీ అమ్మాయి.. గిల్ ఇన్నింగ్స్‌కు చప్పట్లు.. ఎవరీమె? ఫొటోలు వైరల్
నిబంధనల ప్రకారం, డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆటగాళ్లు, అధికారిక సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన డబుల్ సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తిస్తుంటే, అందరి కళ్లు మాత్రం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌పై పడ్డాయి. ఎందుకంటే, అక్కడ ఒక గుర్తు తెలియని మహిళ కనిపించింది. ఆటగాళ్ల వెనుక నిలబడి, గిల్ అద్భుత ఇన్నింగ్స్‌కు చప్పట్లు కొడుతున్న ఆమె ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.
అసలు ఆమె ఎవరు? టీమ్ సపోర్ట్ స్టాఫా? లేక మరెవరైనా అతిథా? ఈ మిస్టరీ విమెన్ పై సోషల్ మీడియాతో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
ఏం జరిగింది?
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ రెండో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన షాట్ ఆడినప్పుడు, ఆ మహిళ డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో నిలబడి ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది. అలాగే, భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో, ఆమె వారి వెనుక నిలబడి ఉన్న మరో ఫొటో కూడా వైరల్ అయింది.
ఈ ఫొటోలు బయటకు రావడంతో, క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్ వంటి ప్రదేశంలోకి అనుమతి లేని వారిని ఎలా రానిచ్చారని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు ఆమె ఎవరై ఉంటారా? అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Also Read: ఫోన్లంటే ఇలా ఉండాలి.. శాంసంగ్ గెలాక్సీ S25 Edge, ఐఫోన్ 16 Pro Maxలో ఏది బెస్ట్?
భారత జట్టుకు సపోర్ట్ స్టాఫ్ వీరే
- హెడ్ కోచ్: గౌతమ్ గంభీర్
- బౌలింగ్ కోచ్: మోర్న్ మోర్కెల్
- బ్యాటింగ్ కోచ్: సితాన్షు కోటక్
- ఫీల్డింగ్ కోచ్: టి.దిలీప్
అయితే, వైరల్ అవుతున్న మహిళ ఈ జాబితాలో లేదు. ఆమె టీమ్ ఫిజియో, మెంటల్ కండిషనింగ్ కోచ్, లేదా మరేదైనా ప్రత్యేక విభాగానికి చెందిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించిన మహిళ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నిబంధనల ప్రకారం, డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆటగాళ్లు, అధికారిక సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు. ఈ నేపథ్యంలో, ఈ వివాదంపై బీసీసీఐ లేదా టీమ్ మేనేజ్‌మెంట్ త్వరలోనే అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ మిస్టరీ వీడదు.
ఈ వివాదం పక్కన పెడితే, మైదానంలో టీమిండియా దుమ్మురేపింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగుల రికార్డు స్థాయి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) కూడా రాణించడంతో, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Who’s she in our dressing room ?? @BCCI pic.twitter.com/Aea2j47YQm
— OG (@sharankalyan424) July 3, 2025