ఆ కారణంతోనే మేం ఓడిపోతున్నాం: డివిలియర్స్

సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు చేసుకుంటున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేదు.

ఆ కారణంతోనే మేం ఓడిపోతున్నాం: డివిలియర్స్

Updated On : April 9, 2019 / 7:52 AM IST

సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు చేసుకుంటున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేదు.

సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు చేసుకుంటున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. అన్ని విభాగాల్లో పట్టు సాధిస్తే ఏదో రకంగా మ్యాచ్ గెలిచేందుకు ఉపయోగపడుతుంది. కానీ, ఎప్పుడూ ఫెయిలయ్యే ఫీల్డింగ్.. అప్పుడప్పుడూ మెరిపించే బ్యాటింగ్ బెంగళూరుకు గెలుపు రుచి అందించలేకపోతున్నాయి. ఈ ఓటముల పట్ల బెంగళూరు టీం స్టార్ ప్లేయర్ డివిలియర్స్ ప్రధాన కారణాన్ని చెప్పుకొస్తున్నాడు. 

ప్రముఖ మీడియాకు రాసిన వ్యాసంలో డివిలియర్స్.. ‘ఓ ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్లు జట్టు అంతా కష్టపడకుండా విజయం దక్కించుకోవాలనుకుంటే ఎలా. వరుసగా 6 మ్యాచ్ లు ఓడిపోవడానికి గల కారణం? ఐపీఎల్ 2019 ఆరంభానికి ముందు జట్టు కూర్పు గురించి ఆలోచించాం. మేం మంచి పోటీనివ్వగలమని నాకనిపించింది. ఇది అబద్ధం కాదు. పోనీ గట్టి జట్టుగానైనా పేరొందుతామని అనుకున్నాం. కానీ, ఆశించినదానికి విరుద్ధంగా జరుగుతున్నాయంతా’
Read Also : సూపర్ కింగ్స్ చేతికి అడ్డంగా దొరికిన జడేజా

‘ఇటీవల ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లోనూ 149 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకోలేకపోయాం. జరిగిన 6 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లలో విజయం అందినట్లే అంది చేజారిపోయింది. జట్టులో ప్రతి ప్లేయర్ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారే. అయితే బ్యాట్స్ మన్ లేదంటే బౌలర్. వారనుకున్నట్లు మొదటగా దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, దాంతో పాటు ప్రతి ప్లేయర్ మంచి ఫీల్డర్ గా ఉండాలనే సంగతి మర్చిపోకూడదు. మైదానంలో ఉన్నంత సేపు బంతి ఎప్పుడు వస్తుందాననే ఆశతో చూస్తూ ఉండాలి’

‘బహుశా మేం ఓడిపోవడానికి కారణమిదేననుకుంటున్నా. టోర్నమెంట్ లో మా ఫీల్డింగ్ మరింత పేలవంగా అనిపిస్తోంది. అప్పటికీ చాలా స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోతున్నాం. తర్వాతి మ్యాచ్ కు పాజిటివ్ గానే ఉన్నాం. తప్పుకుండా గెలిచేందుకే పోరాడతాం’ అని అభిప్రాయపడ్డాడు.
Read Also : పీకేఎల్ చరిత్రలో టాప్ 2 ప్లేయర్, తెలుగు టైటాన్స్ హీరో