Abhishek Nayar : యూపీ వారియర్జ్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు ముందు యూపీ వారియర్జ్ కీలక నిర్ణయం తీసుకుంది.

Abhishek Nayar UP Warriorz head coach
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు ముందు యూపీ వారియర్జ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ప్రధాన కోచ్ గా టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్, మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌ను నియమించింది. జాన్ లూయిస్ స్థానంలో అభిషేక్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా.. లూసిస్ మూడు సీజన్ల పాటు యూపీ వారియర్జ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు.
యూపీ వారియర్జ్ డైరెక్టర్, COO క్షేమల్ వైంగంకర్ మాట్లాడుతూ.. ‘అభిషేక్ నాయర్ ప్రధాన కోచ్‌గా రావడం యూపీ వారియర్జ్‌కు విజయానికి తొలి అడుగు. అభిషేక్ లాంటి నైపుణ్యం కలిగిన వ్యక్తి జట్టు మేనేజ్‌మెంట్‌లో భాగస్వామ్యం కావడం నిజంగా చాలా బాగుంది. క్రీడాకారులను తీర్చిద్దడంలో అతడికి అపార నైపుణ్యం ఉంది. భారత క్రికెట్‌లో చాలా కొద్ది మాత్రమే ఇలాంటి నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు.’ అని వైంగంకర్ అన్నారు.
Tilak Varma : ఓ పక్క భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు తిలక్ వర్మ వరుస సెంచరీలు..
WPL team UP Warriorz have appointed Abhishek Nayar as their head coach https://t.co/24L0jfkbBa pic.twitter.com/uuNZsH6ok9
— ESPNcricinfo (@ESPNcricinfo) July 25, 2025
‘గత 18 నెలల్లోనే అభిషేక్ మూడు ఛాంపియన్‌షిప్ విజేత ప్రచారాలలో భాగమయ్యాడు. ప్రతి ఒక్కటి భిన్నమైన పాత్రలో. ప్రతి ఒక్కటి శాశ్వత ప్రభావాన్ని మిగిల్చింది. ఐక్యంగా, నిర్భయంగా, అభివృద్ధి చెందడానికి ఆరాటపడే వారియర్జ్ జట్టుకు అతను నాయకత్వం వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది.’ అని క్షేమల్ వైంగంకర్ తెలిపాడు.
డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌లో యూపీ వారియర్జ్ పేలవ ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్‌లు ఆడగా కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్టులో కీలక మార్పులు చేస్తోంది. అందులో భాగంగానే అభిషేక్ నాయర్‌ను హెడ్ కోచ్‌గా తీసుకువచ్చింది.