Asia Cup 2023 Final : కప్పును ఇంటికి తీసుకుని రండీ.. వికర్టీ వెంకటేష్ కామెంట్లు వైరల్
కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు ఆసియాకప్ 2023 ఫైనల్ మ్యాచులో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఏడు సార్లు, శ్రీలంక ఆరు సార్లు ఆసియా కప్‌ను ముద్దాడాయి.

Venkatesh all the best for team india
IND vs SL : కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు ఆసియాకప్ 2023 ఫైనల్ మ్యాచులో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఏడు సార్లు, శ్రీలంక ఆరు సార్లు ఆసియా కప్‌ను ముద్దాడాయి. ఈ రెండు జట్లు 9వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్పును ఎనిమిదో సారి గెలవాలని భారత్ భావిస్తుండగా, ఏడో సారి కప్పును అందుకుని భారత రికార్డును సమం చేయాలని శ్రీలంక గట్టి పట్టుదలతో ఉంది.
గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో వాష్టింగన్ సుందర్ ని తుది జట్టులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా, కుల్దీప్ యాదవ్, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్‌లు కూడా ఫైనల్ మ్యాచులో బరిలోకి దిగారు. ఈ క్రమంలో లంక పై పరుగుల మోత మోగిస్తూ వికెట్లు తీస్తూ విజయం టీమ్ఇండియా విజయం సాధించాలని సగటు భారత క్రీడాభిమాని కోరుకుంటున్నాడు.
ఇక సినీ నటుడు విక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంకటేష్ టీమ్ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ రోహిత్ శర్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కప్పును ఇంటికి(భారతదేశానికి) తీసుకురావాలని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వెంకీ మామ కోసం రోహిత్ విక్టరీ కొడతాడని అంటున్నారు.
Pakistan Team: పాక్ జట్టులో బయటపడ్డ విబేధాలు.. బాబర్, షాహీన్ అఫ్రిది మధ్య గొడవ
ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీ చరిత్రలో భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడడం ఇది తొమ్మిదో సారి. భారత్ 5 సార్లు గెలవగా, శ్రీలంక మూడు సార్లు గెలిచింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ భారత్, శ్రీలంక ఆసియా కప్ కోసం పోటీ పడుతున్నాయి. మరీ నేటి మ్యాచులో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే.
Cheering for all our boys in blue! Bring the cup home, Captain. @ImRo45 @BCCI#AsiaCup2023 #INDvsSL pic.twitter.com/CnE3QBEMVW
— Venkatesh Daggubati (@VenkyMama) September 17, 2023