Adhra Premier League : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కొత్త లోగో చూశారా..?

ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్-3 కొత్త లోగో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

Adhra Premier League : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కొత్త లోగో చూశారా..?

Adhra Premier League season 3 new logo unveiling

Updated On : June 10, 2024 / 4:33 PM IST

స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ రంగం సిద్ధ‌మైంది. జూన్ 30 నుంచి జూలై 13 వరకు మూడో సీజ‌న్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్-3 కొత్త లోగో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో క్రికెట‌ర్లు కేఎస్ భ‌ర‌త్‌, నితీశ్‌కుమార్‌, రికీ భుయ్ లు పాల్గొని లోగోను ఆవిష్క‌రించారు.

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రొఫెషనల్ గా సాగనుందని నిర్వాహ‌కులు చెప్పారు. ఈ ప్రీమియం లీగ్ కి మన ఆంధ్ర-మన ఏపీఎల్ అనే ట్యాగ్ లైన్ తో తీసుకొని వస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గల్లిలో టాలెంట్ ఉన్న వారికి మంచి అవకాశం ఇచ్చి, రాష్ట్ర స్థాయికి తీసుకొని వస్తున్నామ‌ని, ఇప్పుడు లీగ్ మ్యాచ్ లు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు.

Pakistan Fan : ట్రాక్ట‌ర్ అమ్మేసా.. పాక్ ఓడిపోయింది..ఇప్పుడెలా..?

ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌రుపున అద‌ర‌గొట్టిన నితీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తాను చాలా కింద స్థాయి నుంచి వ‌చ్చిన‌ట్లు చెప్పాడు. ఆడటానికి మంచి అవకాశాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కల్పించిందన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్స్ చాలా ఫేమ‌స్ అయ్యాయ‌ని, చాలా మంది దీని గురించి అడిగిన‌ట్లు చెప్పారు.

రంజీ ప్లేయర్ కే ఎస్ భరత్ మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వెల్ల‌డించాడు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ కి ఇది మంచి అవకాశన్నాడు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో భాగం కావడం చాలా ఆనందంగా ఉందన్నాడు.

IND vs PAK : పాక్ పై భార‌త్ విజ‌యం.. న్యూయార్క్ పోలీసుల‌కు ఢిల్లీ పోలీసుల ట్వీట్‌..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తరహాలో రూపొందించబడిన ఈ పోటీలో ఆరు జట్లు బ‌రిలో ఉన్నాయి.