Team India world cup jersey : టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ జెర్సీనీ చూశారా..? ఎలాగుందంటే..?
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.

Team India jersey
Team India : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. అదే సమయంలో కొన్ని దేశాలు కొత్త జెర్సీలను విడుదల చేశాయి. ఈ క్రమంలో భారత జట్టు ఆటగాళ్లు ఎటువంటి జెర్సీతో ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతారు అన్న ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. అయితే దానికి సమాధానం దొరికింది.
జెర్సీ స్పాన్సర్ అడిడాస్ (Adidas) తాజాగా టీమ్ఇండియా జెర్సీని (Team India jersey) విడుదల చేసింది. సింగర్ రాఫ్తార్ పాడిన ‘తీన్ కా డ్రీమ్’ (మూడో దాని కోసం కల) అనే పాటతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, లు కొత్త జెర్సీలో కనిపించారు. కొత్త జెర్సీలో భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించారు.
మూమూలుగా టీమ్ లోగో పై మూడు నక్షత్రాలు ఉంటాయి. అయితే.. ఇప్పుడు రెండు నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇవి భారత జట్టు గెలిచిన రెండు (1983, 2011) వన్డే ప్రపంచకప్‌లకు నిదర్శంగా తెలిపారు. జెర్సీతో పాటు పాట కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ జెర్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జెర్సీ చాలా బాగుంది అంటూ నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే మూడో సారి వన్డే ప్రపంచకప్ టీమ్ఇండియా ముద్దాడాలని సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు.
Mohammed Siraj : ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా సిరాజ్.. ఏకంగా 8 స్థానాలు ఎగసి..
1983 – the spark. 2011 – the glory.
2023 – the dream.
Impossible nahi yeh sapna, #3kaDream hai apna.@adidas pic.twitter.com/PC5cW7YhyQ— BCCI (@BCCI) September 20, 2023