ENG vs IND : డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు.. డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మారిందా? లేదా?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది

ENG vs IND 4th test became draw updated wtc points table
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోకి పెద్ద షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ డకౌట్లు అయ్యారు. దీంతో భారత స్కోరు బోర్డు పైకి ఒక్క పరుగు చేరకుండానే రెండు వికెట్లు పడ్డాయి. ఈ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ టీమ్ఇండియా బ్యాటర్లు అసాధారణంగా ఆడి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.
మాంచెస్టర్ మ్యాచ్ డ్రా ముగియడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్ పాయింట్ల పట్టికలో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయో ఓ సారి చూద్దాం.
Rishabh Pant : ఐదో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో ఖతర్నాక్ ప్లేయర్.. ఎవరో తెలుసా?
భారత జట్టు స్థానంలో మార్పు రాలేదు. నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ సైకిల్‌లో భారత్ 4 మ్యాచ్‌లు ఆడింది. ఓ మ్యాచ్‌లో గెలవగా, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 16 పాయింట్లు ఉండగా విజయశాతం 33.330గా ఉంది.
మరోవైపు ఇంగ్లాండ్ స్థానంలోనూ మార్పు చోటు చేసుకోలేదు. ఇంగ్లాండ్ మూడో స్థానంలోనే ఉంది. ఈ సైకిల్‌లో ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 4 నాలుగు మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలవగా, ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 26 పాయింట్లు ఉండగా విజయశాతం 54.170గా ఉంది.
ఇక డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆసీస్ ఖాతాలో 36 పాయింట్లు ఉండగా, విజయశాతం 100గా ఉంది. ఈ జాబితాలో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడిన లంక ఓ మ్యాచ్‌లో గెలవగా, మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉండగా విజయశాతం 66.670గా ఉంది.
ఇక ఐదో స్థానంలో బంగ్లాదేశ్, ఆరో స్థానంలో వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు ఇంకా డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో మ్యాచ్‌లను ఆడలేదు.