Vaibhav Sooryavanshi Profit : రాజస్తాన్ రాయల్స్ లాభాల కొండ సూర్యవంశీ.. పెట్టింది రూ.కోటి.. వచ్చింది రూ.రూ. 12.70 కోట్లు.. 1,160 శాతం లాభం
Vaibhav Sooryavanshi Profit : ఈ ఐపీఎల్ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ జట్టుకి లాభాల కొండగా మారాడు.
After match with SRH Vaibhav Sooryavanshi Rs 1 1 crore investment is now worth Rs 12.7 crore with 1160 pc profit
Vaibhav Sooryavanshi Profit : ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై అతను కనబరిచిన ప్రదర్శన గురించి జనాలు ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో ఆర్థిక నిపుణులు మాత్రం.. సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి లాభాల కొండ అని.. అతడిపై ఖర్చు చేసిన మొత్తానికి ఏకంగా 1160 శాతం లాభాలు సంపాదించిపెడుతున్నాడని అంటున్నారు. SRH పై అతను కనబరిచిన ప్రదర్శన కేవలం ఒక క్రికెట్ మాస్టర్‌క్లాస్ మాత్రమే కాదుని, అదొక ఆర్థిక వింత అంటూ విశ్లేషిస్తున్నారు.
SRHతో జరిగిన మ్యాచ్ లో సూర్యవంశీ కేవలం 37 బంతుల్లో 103 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రికార్డులను తిరగరాశాడు. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ, ఈ యువ ఓపెనర్ “మార్కెట్ వాల్యూ” లీగ్‌లోని అగ్రశ్రేణి సూపర్ స్టార్ల కంటే శరవేగంగా పెరుగుతూ పోయింది. ప్రస్తుతం సూర్యవంశీ ఆర్ఆర్ కి తక్కువ పెట్టుబడికి అత్యధిక లాభాలు ఇచ్చే ఆస్తిగా మారాడని పలు ఇంగ్లీష్ సైట్లు పొగుడుతున్నాయి.
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు ముందే, అతని రోలింగ్ ఖర్చు రూ. 55 లక్షలకు బదులుగా రూ. 6.13 కోట్ల మ్యాచ్ విలువను సృష్టించాడు. కానీ హైదరాబాద్‌పై మ్యాచ్ తర్వాత, అతని మొత్తం సీజన్ విలువ రూ. 7.98 కోట్లకు చేరుకుంది. అతని రోలింగ్ మ్యాచ్ కాస్ట్ ఖర్చు రూ. 62.88 లక్షలతో పోలిస్తే, అతని ప్రదర్శనపై వచ్చిన “లాభం” ఏకంగా 1,169.6 శాతంగా ఉంది. అంటే, వేలంలో ఆర్ఆర్ అతనిపై పెట్టిన ప్రతి రూ. 1.1 కోట్ల ఖర్చు.. ప్రస్తుతం రూ. 12.7 కోట్ల ఆన్-ఫీల్డ్ విలువను ఇస్తోందంటున్నారు.
ఆటగాడి విలువను ఎలా లెక్కిస్తారంటే..
వేలంలో ఆటగాడి ధరను ప్రతి మ్యాచ్ ఖర్చుగా (rolling match cost) మారుస్తారు. సూర్యవంశీకి ఇది మ్యాచ్‌కు రూ. 7.86 లక్షలు. అలా 8 మ్యాచ్‌లకు రూ. 62.88 లక్షలు అవుతుంది. అయితే సదరు ఆటగాడు ప్రతి మ్యాచ్ లో చేసిన పరుగులు, స్ట్రైక్ రేట్, మ్యాచ్ పరిస్థితి వంటి అంశాల ఆధారంగా ఒక ద్రవ్య విలువను (monetary match worth) కేటాయిస్తారు. సూర్యవంశీ విషయంలో ఈ విలువ పూర్తిగా అతని బ్యాటింగ్ ప్రదర్శన పైనే ఆధారపడి ఉంది.
ఆర్థిక సమీకరణం:
- మొత్తం సీజన్ విలువ: 36వ మ్యాచ్ నాటికి రూ. 7.98 కోట్లు.
- లాభం/నష్టం లెక్కింపు: మొత్తం మ్యాచ్ విలువ నుండి రోలింగ్ ఖర్చును తీసివేస్తే.. సూర్యవంశీకి రూ. 7.35 కోట్ల లాభం (రూ. 7.98 కోట్లు – రూ. 62.86 లక్షలు) వచ్చింది.
- పెట్టుబడి రాబడి (Investment Return Multiple): అతని మొత్తం విలువను రోలింగ్ ఖర్చుతో భాగిస్తే, అది 12.696x గా ఉంది.
- దీన్ని బట్టి చూస్తే, “వైభవ్ సూర్యవంశీ స్టాక్”లో రూ. 1 కోటి పెట్టుబడి పెడితే, ఇప్పుడు దాని విలువ రూ. 12.70 కోట్లుగా ఉంది. అంటే రూ. 11.70 కోట్ల నికర లాభం అన్నమాట.
