IPL 2024 : ఫ్రాంఛైజీలు వదిలివేయాలనుకుంటున్న స్టార్ ఆటగాళ్లు వీళ్లే..!
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతంగా 16 సీజన్లు పూర్తి చేసుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతంగా 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు పలు మార్లు ఐపీఎల్ వేలాన్ని నిర్వహించగా అన్ని సార్లు కూడా భారత దేశంలోనే నిర్వహించారు. అయితే.. ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబంధించిన వేలాన్ని దుబాయ్ వేదికగా నిర్వహించనున్నట్లు ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. ఐపీఎల్ 2024 వేలాన్ని డిసెంబర్ 19న నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్లతో పాటు విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 15 వరకు సమయం ఇచ్చారు. డెడ్‌లైన్ దగ్గర పడడంతో అన్ని ఫ్రాంచైజీలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. భారీ కసరత్తులు చేపట్టిన ఫ్రాంచైజీలు ఈ విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుతున్న రిపోర్టుల ప్రకారం ప్రాంఛైజీలు అన్ని కూడా తమ వద్ద ఉన్న నగదు నిల్వలను పెంచుకునేందుకు సమాయత్తం అయ్యాయి. గత సీజన్‌లలో అంతగా ఆడని ప్లేయర్లను వదిలివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అందుతున్న రిపోర్టుల ప్రకారం ప్రాంఛైజీలు విడుదల చేయాలనుకుంటున్న ఆటగాళ్ల వివరాలు ఇవే..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
హ్యారీ బ్రూక్ (రూ.13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ (రూ.8.25 కోట్లు), ఆదిల్ రషీద్ (రూ.2 కోట్లు), అకీల్ హొసేన్(రూ.కోటి).
గుజరాత్ టైటాన్స్..
యశ్ దయాల్ (రూ.3.2 కోట్లు), ఓడియన్ స్మిత్ (రూ.50 లక్షలు), దసున్ షనక(రూ.50 లక్షలు), ప్రదీప్ సాంగ్వాన్ (రూ20 లక్షలు), ఉర్విల్ పటేల్ ఝ (రూ20 లక్షలు).
చెన్నై సూపర్ కింగ్స్..
బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు), అంబటి రాయుడు (రూ.6.75 కోట్లు), కైల్ జేమీసన్ (రూ.కోటి), సిసండ మగాల (రూ.50 లక్షలు), సిమ్రన్‌జీత్ సింగ్ (రూ.20 లక్షలు), షేక్ రషీద్ (రూ.20 లక్షలు).
కోల్‌కతా నైట్‌రైడర్స్..
ఆండ్రీ రసెల్ (రూ.12 కోట్లు), లోకీ ఫెర్గూసన్ (రూ.10 కోట్లు), డేవిడ్ వీస్ (రూ.కోటి), షకీబ్ అల్ హసన్ (రూ.50 లక్షలు), జాన్సన్ చార్లెస్ (రూ.50 లక్షలు), మన్‌దీప్ సింగ్ (రూ.50 లక్షలు).
IND vs NED : వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్క భారతీయుడు
ఢిల్లీ క్యాపిటల్స్..
పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), మనీశ్ పాండే (రూ.2.4 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ.కోటి), లుంగి ఎంగిడి (రూ.50 లక్షలు), రిపల్ పటేల్ (20 లక్షలు).
లక్నో సూపర్ జెయింట్స్..
ఆవేశ్ ఖాన్ (రూ.10 కోట్లు), డేనియల్ సామ్స్ (రూ.75 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (రూ.50 లక్షలు), రొమారియో షెపర్డ్ (రూ.50 లక్షలు), సూర్యాంశ్ హేగ్డే (రూ.20 లక్షలు).
ముంబై ఇండియన్స్..
జోఫ్రా ఆర్చర్ (రూ.8 కోట్లు), క్రిస్ జోర్డన్ (రూ.50 లక్షలు), డుయన్ జన్సెన్ (రూ.20 లక్షలు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.20 లక్షలు), అర్షద్ ఖాన్ (రూ.20 లక్షలు).
పంజాబ్ కింగ్స్..
రాహుల్ చాహర్ (రూ.5.2 కోట్లు), హర్ప్రీత్ భాటియా (రూ.40 లక్షలు), మాథ్యూ షార్ట్ (రూ.20 లక్షలు), బల్తేజ్ ధండా (రూ.20 లక్షలు).
రాజస్తాన్ రాయల్స్..
జేసన్ హోల్డర్ (రూ.5.75 కోట్లు), జో రూట్ (రూ.కోటి), కరియప్ప (రూ.30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ.20 లక్షలు).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
హర్షల్ పటేల్ (రూ.10 కోట్లు), దినేశ్ కార్తీక్ (రూ.5.5 కోట్లు), అనూజ్ రావత్ (రూ.3.4 కోట్లు), ఫిన్ అలెన్ (రూ.80 లక్షలు).
Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. సచిన్ రికార్డు సమం