Aiden Markram : వామ్మో.. ఒక్క శతకంతో మార్‌క్రమ్ మామ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో తెలుసా?
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్ అరుదైన ఘనత సాధించాడు.

Aiden Markram Becomes 1st South African Batter To score a century in the ICC finals
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్ అరుదైన ఘనత సాధించాడు. లండన్‌లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా, అదే విధంగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌ల్లో దక్షిణాఫ్రికా తరుపున శతకం సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడైన్ మార్‌క్రమ్ 102 పరుగులతో, కెప్టెన్ టెంబా బావుమా 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఓవరాల్‌గా మూడో బ్యాటర్‌గా..
డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గానూ మార్‌క్రమ్ రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఈ ఘనత సాధించారు. టీమ్ఇండియాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ మ్యాచ్‌లో హెడ్ (163), స్మిత్ (121) శతకాలతో చెలరేగారు. కాగా.. వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించారు.
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్..
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మార్‌క్రమ్ డకౌట్ అయ్యాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాదడం ద్వారా ఓ ఘనత సాధించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఇలా డకౌట్ అవ్వడంతో పాటు సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా మార్‌క్రమ్ నిలిచాడు.
ENG vs IND : భారత్ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన రాహుల్, గిల్, జడేజా..
సెంచరీతో పాటు వికెట్లు..
ఓ టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో పాటు వికెట్లు తీసిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా మార్‌క్రమ్ రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు బ్రూస్ మిచెల్, షాన్ పొలాక్, జాక్వస్ కలిస్ ఈ ఘనత సాధించారు.