ENG vs IND : భారత్ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన రాహుల్, గిల్, జడేజా..
టీమ్ఇండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న ఈ మ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది.

India intra squad match Rahul Gill and Jadeja half centurys
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌తో సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపికైన కొందరు ఆటగాళ్లు ఇప్పటికే భారత్-ఏ తరుపున ఆడి పరిస్థితులకు అలవాటు పడినప్పటికి, మరికొందరు కీలక ఆటగాళ్లు మ్యాచ్ పరిస్థితులకు అలవాటు పడడానికి ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. టీమ్ఇండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న ఈ మ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది.
కాగా.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు నివాళులు అర్పించింది. ఆటగాళ్లంతా చేతులకు నల్ల రిబ్బన్లతో మైదానంలోకి దిగారు.
బెకెన్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ముగ్గురు భారత బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. టీమ్ఇండియా వ్యూహాలు ప్రత్యర్థి జట్టుకు తెలియకుండా ఉండేందుకు ఈ మ్యాచ్ జరగుతున్న స్టేడియంలోకి టీమ్ఇండియా స్క్వాడ్ తప్ప మిగిలిన ఎవ్వరికి (అభిమానులు, మీడియాకు సైతం) అనుమతి లేదు. ఈ క్రమంలో బీసీసీఐ తొలి రోజు ఆట విశేషాలను పంచుకుంది.
📍 Beckenham
A solid Opening Day in the Intra-Squad game!
Half-centuries for KL Rahul & Captain Shubman Gill 👌 👌
Shardul Thakur amongst the wickets 👍 👍 pic.twitter.com/7lfEFoL4KE
— BCCI (@BCCI) June 13, 2025
ఓపెనర్లు కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు సాధించినట్లు తెలిపింది. ఈ క్రమంలో కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. బీసీసీఐ షేర్ చేసిన ఫోటోల్లో కేఎల్ రాహుల్ సొగసైన కవర్ డ్రైవ్ ఆడుతున్నట్లుగా కనిపించింది. వికెట్ తీసిన తరువాత శార్దూల్ ఠాకూర్ సంబరాలు చేసుకోవడాన్ని చూడొచ్చు.