ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ : తొలి రౌండ్‌లోనే సింధు ఓటమి

మరోసారి ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో సింధూకు పరాభవం ఎదురైంది. గతేడాది జరిగిన పోటీల్లో సెమీ ఫైనల్ వరకూ పోరాడిన సింధూ ఈ సారి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. బర్మింగ్‌హామ్ వేదికగా బుధవారం జరిగిన ఈ పోటీలో తొలి రౌండ్లోనే 16-21, 22-20, 18-21లతో పేలవంగా ముగించింది.
మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ పోటీలో ఐదో సీడ్ సింధు తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్ టూ షట్లర్ సంగ్ జీ హ్యూన్(దక్షిణకొరియా)తో ఆడింది. ఇప్పటివరకూ వీరిద్దరూ 15మ్యాచ్ లలో తలపడగా ఎనిమిదింటల్లో సింధు, ఆరింట్లో సుంగ్ పైచేయి సాధించారు.
ఈ మ్యాచ్ కు ముందు సిందు నెలరోజుల పాటు విరామం తీసుకున్నారు. ఫైనల్ పోరులో కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయే సింధు.. ఈ టోర్నమెంట్‌కు మారిన్ లేకపోవడంతో దాదాపు పెద్ద కష్టమేమీ లేదన్నట్లు భావించింది.
Also Read : పేరు చెప్పొద్దు.. ఆడి చూపించు : IPL 2019 సాంగ్ రిలీజ్