Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం.. ఎందుకిలా చేస్తున్నాడు?

రూల్స్ ప్రకారం ప్రతి ఇంటర్నేషనల్ క్రికెటర్ సమయం దొరికినప్పుడు దేశవాళీలో కచ్చితంగా ఆడాలి.

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం.. ఎందుకిలా చేస్తున్నాడు?

Yashasvi Jaiswal

Updated On : May 9, 2025 / 8:34 PM IST

Yashasvi Jaiswal: టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్‌ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, దేశవాళీ క్రికెట్‌లో గోవా తరఫున ఆడాలని అతడు తాజాగా నిర్ణయం తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు తరఫునే ఆడతానని అంటున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తన ఎన్‌వోసీని ఉపసంహరించుకున్నట్లు చెబుతూ మెయిల్ పంపాడు. వచ్చే దేశవాళీ సీజన్‌లో ముంబై తరఫున ఆడడానికి సిద్ధమని తెలిపాడు.

Also Read: రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10 వేల తగ్గింపు.. ఛాన్స్‌ మిస్‌ అయితే మళ్లీ రాదు!

యశస్వి జైస్వాల్ ఇంతకు ముందు దేశవాళీలో గోవా జట్టుకే ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పట్లో అతడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు. మళ్లీ ఇప్పుడు మనసు మార్చుకుని ముంబై తరఫున ఆడతానని చెబుతున్నాడు.

రూల్స్ ప్రకారం ప్రతి ఇంటర్నేషనల్ క్రికెటర్ సమయం దొరికినప్పుడు దేశవాళీలో కచ్చితంగా ఆడాలి. ఈ మేరకు బీసీసీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీలో ఆడాల్సి ఉంది. దీవంతో గోవాకు వెళ్లాలనుకున్న తన ప్లాన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఇవాళ తెలిపాడు. ముంబై తరఫున ఆడేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అనుమతించాలని విన్నవించుకుంటున్నాడు.