IPL 2025: ఐపీఎల్‌ 2025లో కీలక పరిణామం.. కోకాకోలాకు ఝలక్ ఇచ్చిన ముకేశ్ అంబానీ కాంపా కోలా

చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు కోల్‌కతా నైట్ రైడర్‌లతో తన భాగస్వామ్యాన్ని మాత్రం కొనసాగిస్తుంది.

IPL 2025: ఐపీఎల్‌ 2025లో కీలక పరిణామం.. కోకాకోలాకు ఝలక్ ఇచ్చిన ముకేశ్ అంబానీ కాంపా కోలా

Updated On : February 15, 2025 / 1:53 PM IST

కోకాకోలాకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీకి చెందిన కాంపా కోలా ఝలక్‌ ఇచ్చింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బేవరేజ్‌ బ్రాండ్ కాంపా కోలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ కో-ప్రెజెంటింగ్ హక్కులను కొనుగోలు చేసింది.

కాంపా కోలాను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో కాంపా కోలా ఇప్పుడు కోకాకోలాను పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. కోకాకోలా అంతర్జాతీయ సంస్థ అన్న విషయం తెలిసిందే. కోకాకోలాను దెబ్బకొట్టేలా ఐపీఎల్‌ కో ప్రెజెంటర్‌ హక్కులను కాంపా కోలా దక్కించుకుంది.

ఇందుకుగానూ కాంపా కోలా దాదాపు రూ.200 కోట్లు ఖర్చుచేయనుంది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో కో-ప్రెజెంటింగ్‌ రైట్స్‌ కోకాకోలా కంపెనీకి చెందిన థమ్సప్‌ రూ.200 కోట్లకు దక్కించుకున్న విషయం విదితమే. ఇప్పుడు కూడా అదే ఖర్చుతో కాంపా కోలా ఐపీఎల్‌ కో ప్రెజంటర్‌గా ఉండనుంది.

మరోవైపు, కోకాకోలా ప్రస్తుత ఐపీఎల్‌ కో ప్రెజంటర్‌గా ఉండకపోయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు కోల్‌కతా నైట్ రైడర్‌లతో తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. అదనపు స్పాన్సర్‌షిప్‌లను పొందింది.

కొన్ని రిపోర్టుల ప్రకారం.. ఐపీఎల్ 2025 నుంచి యాడ్స్‌ ఆదాయం గత ఏడాదితో పోల్చితే 8-10 శాతం పెరుగుతుందని, సుమారు రూ.4,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

కాంపా కోలాతో కూల్‌ డ్రింక్స్‌ మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్‌ ఇప్పటికే రాస్కీక్‌ గ్లూకో ఎనర్జీ డ్రింక్‌ తో పాటు స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ స్పిన్నర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ధరలు రూ.10గా ఉన్నాయి.

వీటికే ఇప్పుడు పబ్లిసిటీ చేసుకోవాలని రిలయన్స్ భావిస్తోంది. కాంపా కోలా ఐపీఎల్‌ కో ప్రెజంటర్‌గా ఉంటూనే పలు ఐపీఎల్‌ టీమ్‌లతోనూ కలిసి పనిచేస్తుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, హైదరాబాద్‌, పంజాబ్‌, గుజరాత్‌, ముంబై జట్లతో స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాలను ఇప్పటికే కుదుర్చుకుంది.