Anushka Sharma : విరాట్ కోహ్లీకి మద్ధతుగా అహ్మదాబాద్ చేరుకున్న అనుష్కశర్మ

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో శనివారం జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ని చూడటానికి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అహ్మదాబాద్‌కు వచ్చారు. తన భర్త,భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్ధతుగా కొనసాగుతున్న ప్రపంచ కప్ 2023లో అనుష్క శర్మ హాజరవుతున్న మొదటి మ్యాచ్ ఇది.....

Anushka Sharma : విరాట్ కోహ్లీకి మద్ధతుగా అహ్మదాబాద్ చేరుకున్న అనుష్కశర్మ

Kohli Anushka Sharma

Updated On : October 14, 2023 / 9:11 AM IST

Anushka Sharma : ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో శనివారం జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ని చూడటానికి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అహ్మదాబాద్‌కు వచ్చారు. తన భర్త,భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్ధతుగా కొనసాగుతున్న ప్రపంచ కప్ 2023లో అనుష్క శర్మ హాజరవుతున్న మొదటి మ్యాచ్ ఇది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ తన భర్తతో కలిసి ప్రయాణిస్తూ ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్‌తో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌ల సమయంలో చెన్నై, ఢిల్లీ రెండింటిలోనూ ఉన్నారు.

Also Read :Operation Ajay : ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో ఢిల్లీ వచ్చిన రెండో విమానం

కొన్ని రోజుల ముందు గౌహతిలో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్ తర్వాత కోహ్లి,అనుష్క శర్మ కుమార్తె వామిక ముంబయికు తిరిగివచ్చారు. వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీకి అద్భుత రికార్డు ఉంది. కోహ్లీ 100 కంటే ఎక్కువ స్ట్రైక్-రేట్‌ సాధించారు. ఐసిసి ఈవెంట్‌లో, కోహ్లి 7 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌తో ఆడారు. ప్రపంచ కప్ 2023లో కోహ్లీ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు సాధించారు. ఈ వారం ఢిల్లీలో భారత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 85, అఫ్ఘానిస్థాన్‌పై 55 నాటౌట్ గా నిలిచారు.

Also Read :Gaza tunnels : గాజాలోని హమాస్ రహస్య సొరంగాలపై దాడి…ఇజ్రాయెల్‌ సైన్యానికి సవాలు