IPL 2023: ఢిల్లీ vs కోల్‌కతా మ్యాచ్‌కు స్పెషల్ గెస్ట్.. ఐఫోన్స్ ఇంటికి పంపాలంటూ నెటిజన్ల కామెంట్లు
ఢిల్లీ vs కోల్‌కతా మ్యాచ్‌ను చూసేందుకు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయన ఎవరో కాదు యాపిల్ సీఈవో టిమ్ కుక్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Apple CEO Tim Cook Watches IPL (pic source twitter)
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 సీజన్‌లో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తరువాత కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని సైతం ఆపసోపాలు పడి ఛేదించింది. ఎలాగైతేనేమీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచింది. ఈ విజయం అటు ఢిల్లీ జట్టుతో పాటు ఇటు అభిమానుల్లో ఎనలేని సంతోషాన్ని నింపింది.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయన ఎవరో కాదు యాపిల్ సీఈవో టిమ్ కుక్. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కాగా.. 2016లో కుక్ ఇండియాకు వచ్చినప్పుడు కాన్పూర్‌లోని జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించగా ఏడు సంవత్సరాల తరువాత కోల్‌కతా-ఢిల్లీ మ్యాచ్‌ను చూసినట్లు పేర్కొంది.
View this post on Instagram
వాస్తవానికి ముంబై, ఢిల్లీలలో యాపిల్ స్పెషల్ స్టోర్లను ప్రారంభించేందుకు టిమ్ కుక్ భారతదేశానికి వచ్చారు. స్టోర్‌లను ప్రారంభించిన ఆయన పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో తన బిజీ షెడ్యూల్‌లో కొంత సమయాన్ని వెచ్చించి ఢిల్లీ-కోల్‌కతా మ్యాచ్ చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌తో కలిసి ఆయన మ్యాచ్‌ను చూశారు.
IPL 2023, DC vs KKR: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఢిల్లీ.. లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. “భాయ్ ఓ ఐఫోన్ ను మా ఇంటికి పంపించండి” అని ఓ నెటీజన్ అనగా, అసలు సిసలు ఐపీఎల్ మజాను ఆస్వాదించాలనుకుంటే చెన్నై వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ చూడాల్సిందేనని అని మరో నెటీజన్ కామెంట్ చేశారు.
Bhaii plss ek iPhone ghar ko bhijadho 😭😭
— Stylish Star (@stylishbhaii) April 20, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (57; 41 బంతుల్లో 11 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు.
Tim Cook : ఢిల్లీకి టిమ్ కుక్ ఆగయా.. ఆపిల్ రెండో స్టోర్ రెడీ.. వచ్చి రాగానే ఆయన ఏం చేశారంటే?