ప్రపంచ నెం.1గా నిలిచిన అపూర్వి చండేలా

ప్రపంచ నెం.1గా నిలిచిన అపూర్వి చండేలా

Updated On : May 2, 2019 / 1:28 PM IST

భారత స్టార్ షూటర్ అపూర్వి చండేలా బుధవారం జరిగిన 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సత్తా చాటి వరల్డ్ నెం.1గా స్థానం దక్కించుకుంది. ఈ ఈవెంట్లలో సత్తా చాటిన భారత ప్లేయర్లు మొత్తం 5మంది 2020ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ టోర్నీలో 252.9పాయింట్లతో వరల్డ్ రికార్డు కొట్టేసింది చండేలా.  2014గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో చండేలా స్వర్ణాన్ని గెలుచుకుంది. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గే్మ్స్‌లో కాంస్యాన్ని దక్కించుకుంది. 

2018ఆసియా గేమ్స్‌లో 10మీ. మిక్స్‌డ్ రైఫిల్ ఈవెంట్‌లో చండేలా కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ఫీట్ సాధించిన ఆనందంలో చండేలా ట్విట్టర్ ద్వారా ఇలా సంతోషం వ్యక్తం చేసింది. 

‘నా షూటింగ్ కెరీర్‌లో వరల్డ్ నెం.1 మైలురాయిని చేరుకున్నాను’ అని తెలిపింది. ఆమె తర్వాతి స్థానంలో అంజుమ్ మోడ్గిల్ నిలిచారు.