సెప్టెంబర్ 19 నుంచి అరబ్ ఎమిరేట్స్‌లో ఐపీఎల్.. నవంబర్ 8న ఫైనల్

మొత్తానికి ఐపీఎల్ మీద క్లారిటీ వచ్చింది. క్రికెట్ ఆడే దేశాలన్నింటిలోనూ కరోనా. అందుకే దుబాయ్‌కి టోర్నమెంట్ మార్చారు. వచ్చే వారం IPL Governing Council సమావేశమై షెడ్యూల్‌ను రెడీ చేస్తుంది. ఇప్పటికే BCCI అన్ని ఫ్రాంచైజ్ లకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆమోదం తెలుపుతుంది. ఇది 51రోజుల ఫుల్ IPL అని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఫ్రాంచైజ్ లకు స్పష్టం చేశారు.
వేసవి దాటితో మళ్లీ ఐపీఎల్‌కు అవకాశమేలేదు. ఎప్పుడైతే ICC అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సిన టి20 వరల్డ్ కప్‌ను వాయిదావేసిందో… షెడ్యూల్‌లో ఐపీఎల్‌కు అవకాశమొచ్చింది. కరోనా కాలం కాబట్టి గతంలా ఓ కార్నివాల్‌లా ఐపీఎల్ ను నిర్వహించడం కుదరదు. ఆర్బాటాలకు అవకాశంలేదు. జనం అనుమతించినా Standard Operating Procedureను ఫాలో కావాల్సిందే. కొద్దిరోజుల్లోనే ఇవి సిద్ధంకానున్నాయి. భౌతిక దూరం తప్పదు. ముందు ప్రభుత్వం అనుమతిని కోరుతారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకొంటే…. ఒకసారి ఏం చేయాలో నిర్ణయించుకున్నాక ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు BCCI సమాచారమిస్తుంది.
ప్రస్తుతం UAEలో మూడు క్రికెట్ స్టేడియంలు సిద్ధంగా ఉన్నాయి. దుబాబ్, అబుదాబి, షార్జీ క్రెకెట్ గ్రౌండ్స్ లో ఒకేసారి మూడు మ్యాచ్ లను నిర్వహించొచ్చు. షార్జాలో మంచి క్రికెట్ సంప్రదాయముంది. భారతీయ క్రికెటర్లకు అభిమానులూ ఉన్నారు. మరి ప్రాక్టీస్ సంగతేంటి? ICC Academy ట్రయినింగ్ గ్రౌండ్ లను అద్దెకు తీసుకోవాలనుకొంటోంది బిసిసిఐ.
న్యూజిలాండ్ దేశాలు కరోనాను జయించినా ఎందుకు అరబ్ ఎమిరేట్స్ ను BCCI కోరుకొంటోందంటే… రీజన్ ఉంది. corona health protocol ప్రకారం negative COVID-19 test report తీసుకొస్తే… వాళ్లు quarantineలో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ల దగ్గర నెగిటీవ్ సర్టిఫికెట్ లేకపోతే… పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. అదే ఆస్ట్రేలియాలో అంటే 14రోజుల quarantine తప్పనిసరి. అందువల్ల అరబ్ ఎమిరేట్స్ లో రెండువారాలు కలసివచ్చినట్లు.