Vizag Test : విశాఖలో క్రికెట్ సందడి.. విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్
విశాఖలో మరోసారి క్రికెట్ సందడి నెలకొంది.

Arrangements are complete for the second Test match in Visakhapatnam
India vs England : విశాఖలో మరోసారి క్రికెట్ సందడి నెలకొంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 శుక్రవారం నుంచి జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు విశాఖ చేరుకున్నాయి. ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి.
ఇక విశాఖ మైదానంలో టీమ్ఇండియాకు చాలా మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు టీమ్ఇండియా రెండు టెస్టు మ్యాచులు ఆడగా రెండింటిలోనూ ఘన విజయం సాధించింది. కాగా శుక్రవారం నాటి నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌పై ఏసీఏ సెక్రటరీ గోపినాథ్ మాట్లాడారు.
Shikhar Dhawan : యాంకర్‌తో శిఖర్ ధావన్.. మీరు నన్ను ఆకర్షించారా..?
ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు వివరించారు. మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ ధరలు ప్రేక్షకులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ప్రతి రోజు రెండు వేల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ లెక్కన మొత్తం 5 రోజుల్లో 10 వేల మంది విద్యార్థులు మ్యాచ్ చూడనున్నారని, వారి కోసం ఓ స్టాండ్ ను కేటాయించినట్లు చెప్పారు. ఇక ఇప్పటికే ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్లులో టికెట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మైదానంలోకి ప్రేక్షకులు అనుమతించే సమయంలోనే ప్రతి ఒక్కరికి ఓ ఎంట్రీ పాస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Virat Kohli : మీడియాపై విరాట్ కోహ్లీ బ్రదర్ ఆగ్రహం.. మా అమ్మకు ఏం కాలేదు