Ashwin : బంగ్లాదేశ్‌పై విజ‌యం.. అశ్విన్ రికార్డులే రికార్డులు..

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

Ashwin : బంగ్లాదేశ్‌పై విజ‌యం.. అశ్విన్ రికార్డులే రికార్డులు..

Ashwin Breaks Become 8th Leading Wicket Taker In Test Cricket

Updated On : September 22, 2024 / 1:18 PM IST

Ravichandran Ashwin : చెన్నైలోని చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఏకంగా 280 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించ‌డంలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క పాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో బంగ్లాకు చుక్క‌లు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో (113) శ‌త‌కంతో చెల‌రేగ‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో ఆరు వికెట్ల‌తో బంగ్లా ప‌త‌నాన్ని శాసించాడు. దీంతో అత‌డికి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

ఇదిలా ఉంటే.. అశ్విన్ ప‌లు ఘ‌న‌త‌ల‌ను సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో వెస్టిండీస్ దిగ్గజ బౌల‌ర్ కోట్నీ వాల్ష్ రికార్డును బ్రేక్ చేశాడు. కోట్నీ వాల్ ఖాతాలో 519 టెస్టు వికెట్లు ఉండ‌గా.. తాజా టెస్టు ప్ర‌ద‌ర్శ‌న‌తో అశ్విన్ టెస్టు వికెట్ల సంఖ్య 522 కి చేరింది. ఇక ఈ జాబితాలో 800 వికెట్ల‌తో ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా షేర్ వార్న్‌, జేమ్స్ అండ‌ర్స‌న్‌లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్‌ల‌కు మొండిచేయి..

టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాళ్లు..

* ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (శ్రీలంక‌) – 800 వికెట్లు
* షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708 వికెట్లు
* జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్‌) – 704 వికెట్లు
* అనిల్ కుంబ్లే (భార‌త్‌) – 619 వికెట్లు
* స్టువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్‌) – 604 వికెట్లు
* గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563 వికెట్లు
* నాథ‌న్ లైయాన్ (ఆస్ట్రేలియా) – 530 వికెట్లు
* ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 522 వికెట్లు

డ‌బ్ల్యూటీసీలో అత్య‌ధిక సార్లు 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌..

ఇదిలా ఉంటే.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(డ‌బ్ల్యూటీసీ) చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ఐదు, అంత‌కంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌల‌ర్ గా అశ్విన్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ నాథ‌న్ లైయాన్ రికార్డును బ్రేక్ చేశాడు. లైయాన్ 10 సార్లు ఈ ఘ‌న‌త సాధించ‌గా తాజా ప్ర‌ద‌ర్శ‌న‌తో అశ్విన్ 11 సార్లు దీన్ని అందుకున్నాడు.

IND vs BAN : అశ్విన్ మాయాజాలం.. తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

డ‌బ్ల్యూటీసీలో అత్య‌ధిక సార్లు 5 ప్ల‌స్ వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌..
* ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 11 సార్లు
* నాథ‌న్ లైయాన్ (ఆస్ట్రేలియా) – 10 సార్లు
* పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 8 సార్లు
* జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 7 సార్లు
* హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 6 సార్లు
* టీమ్ సౌథీ (న్యూజిలాండ్‌) – 6 సార్లు