అశ్విన్ మాన్కడింగ్‌కు కౌంటర్‌గా ధావన్ డ్యాన్స్ చూశారా..

ఐపీఎల్ 2019లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్. దాదాపు మర్చిపోయిన మాన్కడింగ్ పద్ధతిని గుర్తు చేసి అందరి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకసారి కూడా వార్నింగ్ ఇవ్వకుండా అవుట్ చేయడం పద్ధతి కాదని వారించడంతో తర్వాత మ్యాచ్ నుంచి వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం ఆడిన మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 13వ ఓవర్ బౌలింగ్ వేస్తున్నాడు. ఓవర్లో 2వ బాల్ వేసేందుకు వచ్చి ఒక్కసారిగా ఆగిపోయి ధావన్ వైపుకు చూశాడు. కానీ, అప్పటికీ బ్యాట్ క్రీజులోనే ఉండడంతో అశ్విన్‌ను వెక్కిరించుకుంటూ డ్యాన్స్ చేసి చూపించాడు.
అంతేకాదు, తర్వాత మరోసారి బాల్ వేసేందుకు వస్తున్న అశ్విన్‌ను చూసి దా..దా..దా.. అంటూ సైగలు చేస్తూ.. పరుగుతీసేందుకు ఉపక్రమించాడు. పాపం.. అశ్విన్ మ్యాచ్ ఓడిపోవడంతో పాటు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా కూడా భరించాల్సి వచ్చింది. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ 5వికెట్ల తేడాతో గెలుపొందింది.
This just happened between #Ashwin and #Dhawan during #vivoipl #kxip #delhicapitals #ipl #cricket @IPL #DCvKXIP pic.twitter.com/3PDWSOjspH
— thetelescope? (@thetelescope_in) April 20, 2019