Tokyo Olympics – Lovlina: అస్సాం సీఎం అభినందన అద్దిరిపోయిందంతే.. లవ్లీనా ఇక డీఎస
ఒలింపిక్ 2020 కాంస్య పతక విజేత లవ్లీనాకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. డీఎస్పీ పోస్టును కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆమె సొంతూరు గోలాఘట్‌లో లవ్లీనా పేరు మీద స్టేడియం నిర్మించనున్నారు.

Lovlina
Tokyo Olympics – Lovlina: ఒలింపిక్ 2020 కాంస్య పతక విజేత లవ్లీనాకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. డీఎస్పీ పోస్టును కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆమె సొంతూరు గోలాఘట్‌లో లవ్లీనా పేరు మీద స్టేడియం నిర్మించనున్నారు. ఆమెకు ప్రేరణ అందిస్తూ.. ఇంత దూరం ప్రయాణించడానికి కారణమైన కోచ్‌కు రూ.10లక్షల నగదు పురస్కారం ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. లేటుగా ప్రకటించినా.. గ్రేటుగా అనౌన్స్ చేశారు కేరళ సీఎం పినరయి విజయన్. ఒలింపిక్ లో కాంస్య పతకం గెలిచిన హాకీ గోల్ప్ కీపర్ శ్రీజేశ్ కు రూ.2కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న మిగతా మళయాళీలకు రూ.5లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఒడిశా హాకీ మహిళా ప్లేయర్లకు సీఎం నవీన్ పట్నాయక్.. నగదు రివార్డుగా అందజేశారు. డీప్ గ్రేస్ ఎక్కా, నమితా టప్పో, బిరేంద్రా లక్రా, అమిత్ రోహిద్ లకు ప్రదర్శనను ప్రశంసించారు. బిరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్ లకు రూ.2.5కోట్లు రివార్డుగా అందజేశారు. డీప్ గ్రేస్ ఎక్కాకు రూ.50లక్షలు ఇచ్చారు.