IND vs AFG 2nd T20 : ప్రత్యేక మైలురాయిని చేరుకున్న అక్షర్ పటేల్
భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు.

Axar Patel
Axar Patel -IND vs AFG 2nd T20 : భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇండోర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20మ్యాచులో అతడు దీన్ని సాధించాడు. అఫ్గాన్ ఆటగాడు గుల్బాదిన్ నైబ్ (57; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్ చేయడం ద్వారా అక్షర్ టీ20ల్లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 234 మ్యాచుల్లో అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. అతడి అత్యుత్తమ ప్రదర్శన 4/21.
ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు వేసిన అక్షర్ 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 200 వికెట్లు తీసిన 11వ బౌలర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు. టీమ్ఇండియా తరుపున 52 టీ20 మ్యాచులు ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. 361 పరుగులు చేశాడు.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. టీ20ల్లో ఒకే ఒక్కడు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో గుల్బాదిన్ నైబ్ (57; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. నజీబుల్లా జద్రాన్(23), ముజీబ్ ఉర్ రెహమాన్ (21), కరీం జనత్ (20) లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్‌లు చెరో వికెట్లు సాధించారు. శివమ్ దూబె ఓ వికెట్ పడగొట్టాడు.
Axar Patel gets the main man Gulbadin Naib for 57.
200 T20 wickets for Axar. pic.twitter.com/QuxkK9WrQS
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2024