‘ఒక్క మ్యాచ్‌లో నిషేధం’పై ఆగ్రహంతో రిషబ్ పంత్..: బయటపెట్టిన అక్షర్ పటేల్

Axar Patel: రిషబ్ పంత్ ఇవాళ కూడా మైదానం వద్దే ఉన్నాడని, టీమ్‌ను..

‘ఒక్క మ్యాచ్‌లో నిషేధం’పై ఆగ్రహంతో రిషబ్ పంత్..: బయటపెట్టిన అక్షర్ పటేల్

Axar Patel

Updated On : May 12, 2024 / 9:33 PM IST

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ ఒక్క మ్యాచ్‌ ఆడకుండా సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ తెలిపిన విషయం తెలిసిందే. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన కీలక మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఆ జట్టు కెప్టెన్ పంత్ పై మ్యాచ్ నిషేధంతో పాటు బీసీసీసీ రూ.30 లక్షల జరిమానా విధించింది. దీనిపై రిషబ్ పంత్ స్పందన ఏంటన్న విషయాన్ని అక్షర్ పటేల్ బయటపెట్టాడు. రిషబ్ పంత్‌ మ్యాచులో ఆడకపోవడంతో అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించాడు.

టాస్ వేసిన అనంతరం అక్షర్ పటేల్ మాట్లాడుతూ… రిషబ్ పంత్ కోపంతో సస్పెన్షన్‌పై అప్పీల్ చేశాడని తెలిపాడు. బౌలింగ్ సమయంలో బౌలర్లు చాలా సమయం తీసుకుంటారని చెప్పాడు. అందుకు కెప్టెన్ కు శిక్షవేస్తారని అన్నాడు. రిషబ్ పంత్ ఇవాళ కూడా మైదానం వద్దే ఉన్నాడని, టీమ్ ను ప్రోత్సహిస్తాడని తెలిపాడు.

మ్యాచ్ జరుగుతున్న బెంగళూరు స్టేడియం ఛేజింగ్ కు అనుకూలించే మైదానమని అక్షర్ పటేల్ చెప్పాడు. ఆట ప్రారంభం బాగుంటే గేమ్ పై ఆధిపత్యం చెలాయిస్తామని తెలిపాడు. కాగా, ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.

CSK vs RR: రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయ ఢంకా