Viral Video: ధోనీ, కోహ్లీ, రోహిత్ గురించి డైలాగులు చెప్పిన బాలకృష్ణ
బాలయ్య డైలాగ్స్ అంటే వేరే లెవల్. మరి మన ఫేవరెట్ క్రికెటర్స్‌కు..

Balakrishna
Viral Video: క్రికెట్ స్టార్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి సినీనటుడు నందమూరి బాలకృష్ణ డైలాగులు చెప్పి అదరగొట్టారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.
ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ పేరు వినగానే గుర్తుకు వచ్చే డైలాగులు ఏవంటూ యాంకర్ అడిగిన ప్రశ్నలకు బాలయ్య సమాధానంగా తన సినిమాల్లోని డైలాగులు చెప్పారు.
‘బాలయ్య డైలాగ్స్ అంటే వేరే లెవల్. మరి మన ఫేవరెట్ క్రికెటర్స్‌కు.. ఆయన మూవీలో డైలాగ్స్ డెడికేట్ చేస్తే.. అది కూడా ఆయనే చెబితే.. బొమ్మ సూపర్ హిట్’ అని స్టార్ మా ఎక్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్న బాలయ్య క్రీడా కార్యక్రమాలకూ హాజరు అవుతుండడం గమనార్హం.
కాగా, గత ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. అందులో చెన్నై గెలిచింది. ఆ రెండు జట్లే ఈ సారి తొలి మ్యాచ్ ఆడతాయి.
Also Read
Balayya డైలాగ్స్ అంటే వేరే లెవల్ ⚡
మరి మన ఫేవరెట్ క్రికెటర్స్‌కు..
ఆయన మూవీలో డైలాగ్స్ డెడికేట్ చేస్తే ?అది కూడా ఆయనే చెబితే.. ?
బొమ్మ Super-Hit!!చూడండి
TATA IPL 2024 | FRI, Mar 22 నుండి
మీ #StarSportsTelugu లో#IPLonStar pic.twitter.com/B1LI4xfIe4— StarSportsTelugu (@StarSportsTel) February 29, 2024
: ఫైనల్లో పుణెరి పల్టాన్.. సెమీస్‌లో పట్నా పైరేట్స్‌పై 37-21తో గెలుపు